Samantha: సరికొత్త రెమ్యూనరేషన్ విధానానికి నాంది పలికిన సమంత!

సినిమా ఇండస్ట్రీలో సమానత్వం ఉండాలని చాలామంది మాట్లాడుతారు కానీ.. ఆచరించడానికి మాత్రం ఎందుకో ముందుకు రారు. గౌరవించడంలో సమానత్వం అనేది ఎప్పటికీ రాకపోవచ్చు కానీ.. ఒక సినిమాకి పనిచేసే టెక్నీషియన్స్ అందరికీ సమానమైన పారితోషికం ఇవ్వడం ద్వారా గౌరవించడం అనేది మాత్రం త్వరలోనే సాధ్యమయ్యేలా ఉంది. సమంత (Samantha) ఆరంభించిన తన స్వంత ప్రొడక్షన్ బ్యానర్ లో రాబోయే “బంగారం” అనే సినిమా ప్రొడక్షన్ విషయంలో ఓ మంచి నిర్ణయం తీసుకుంది.

Samantha

సినిమాకి పనిచేసే ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లు, మరీ ముఖ్యంగా ఆడవారికి, మగవారికి సమానమైన పారితోషికం ఇచ్చేలా నిర్ణయించిందట. అదే విధంగా సినిమాకి వచ్చే లాభాల నుండి సమానమైన షేర్స్ ఇచ్చే విధంగా తన సొంత బ్యానర్ అయిన ట్రాలల మూవింగ్ పిక్చర్స్ సంస్థను తీర్చిదిద్దుతున్నట్లు నందిని రెడ్డి (Nandini Reddy) ఇటీవల తెలియజెప్పింది. ఈ పద్ధతిని అందరూ ఫాలో అవ్వగలిగితే గనుక సినిమా ఇండస్ట్రీలో హెచ్చుతగ్గులకు చోటు ఉండదు.

అయితే.. ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాల వరకు పర్లేదు కానీ, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల విషయంలో ఏమేరకు వర్తింపజేయగలరు అనేది చర్చనీయాంశం. ఎందుకంటే.. సదరు సినిమాల టికెట్లు తెగేది హీరోల బట్టే తప్ప హీరోయిన్ల బట్టి కాదు అని అందరికీ తెలిసిన విషయం. అయితే.. అన్నిటికీ కాకపోయినా కాన్సెప్ట్ సినిమాలు మరియు చిన్న బడ్జెట్ సినిమాల విషయంలో ఈ సమానమైన పారితోషిక పద్ధతి పాటించడం అనేది మంచి పద్ధతిగా మారుతుంది.

అప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా హీరోయిన్లు ఎలాంటి ఇబ్బందిపెట్టకుండా పాల్గొనే అవకాశాలు ఉంటాయి. మరి ఈ పద్ధతిని మన ప్రొడ్యూసర్ కౌన్సిల్ కన్సిడర్ చేసి, కొందరైనా ఈ పద్ధతిని ఫాలో అయ్యేలా చేయగలిగితే బాగుంటుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus