హిట్ అయినా బాధపడుతున్నాడు!!!

మంచు వారి వారసుడు మంచి విష్ణు తన తొలి సినిమా నుంచి మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అక్కడక్కడా కొన్ని సూపర్ హిట్స్ వచ్చినప్పటికీ గ్యారంటీ ఉన్న హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. ఇదిలా ఉంటే తాజాగా విష్ణు- రాజ్ తరుణ్ తో నటించిన ‘ఈడోరకం-ఆడోరకం’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిలిచి సరికొత్త కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది. ఇదిలా ఉంటే సినిమా అంతటి ఘన విజయాన్ని సాధించినప్పటికీ, సినిమా యూనిట్ అంతా హ్యాపీ అయినప్పటికీ విష్ణు మాత్రం చాలా బాధలో ఉన్నాడు అని తెలుస్తుంది.

అదేంటి వెతక బోయిన తీగ కాలికి తగిలినట్లు, రావాలి…రావాలి అని అనుకుంటున్న హిట్ రానే వచ్చినా విష్ణు ఎందుకు దిగులు చెందుతున్నాడు అంటే…సినిమా నిర్మించే ఛాన్స్ తన చేతిలోంచి జారినందుకు అని తెలుస్తుంది, అదేమిటంటే…పంజాబి సినిమా అయిన ఈడోరకం ఆడోరకం మాత్రుకను ముందు మంచు విష్ణు రైట్స్ కొన్నాడట. అయితే ఇదే సినిమా తీయలనే ఆలోచనతో వేరు హీరోలు ప్రయత్నిస్తుండగా అనీల్ సుంకర ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను మీదేసుకున్నాడు. అయితే మంచు విష్ణు, రాజ్ తరుణ్ లను హీరోగా పెట్టి సినిమా తీసి హిట్ కొట్టాడు. ఆద్యంతం కామెడీతో కితకితలు పెట్టించిన ఈడోరకం ఆడోరకం తన ప్రొడక్షన్ లో వచ్చి హిట్ అయితే బాగుండేది అని కొద్దిగా ఫీల్ అవుతున్నాడు మంచు విష్ణు. అసలే హిట్స్ లేక బాధ పడుతున్న సమయంలో భారీ హిట్ వచ్చినందుకు సంతోషించక ఈ దిగాలు ఎందుకు విష్ణు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus