Etthara Jenda: ‘ఆర్.ఆర్.ఆర్’ నుండి ‘ఎత్తర జెండా’ ఫుల్ వీడియో సాంగ్ విడుదల..!

Advertisement

‘బాహుబలి'(సిరీస్) తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం మార్చి 25న విడుదలై ఇప్పటికీ సక్సెస్ ఫుల్ రన్ ను కొనసాగిస్తుంది. ఇప్పటికే రూ.1100 గ్రాస్ వసూళ్ళను అధిగమించిన ఈ మూవీ… ‘కె.జి.ఎఫ్2’ వంటి మరో పెద్ద సినిమా వచ్చినా ఇంకా రిపీట్ ఆడియన్స్ ఈ మూవీని ఎగబడి చూస్తున్నారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ లాంగ్ రన్ ను కొనసాగించాలని మేకర్స్ కూడా వారానికో వీడియో సాంగ్ ను విడుదల చేస్తూ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.

Click Here To Watch NOW

ఇప్పటికే ‘నాటు నాటు’ ‘కొమ్మా ఉయ్యాల’ ‘దోస్తి’ వంటి పాటల్ని విడుదల చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ టీం తాజాగా ‘ఎత్తర జెండా’ వీడియో సాంగ్ ను కూడా విడుదల చేసింది. నిజానికి ఈ పాటని విడుదలకి ముందు ప్రమోషనల్ సాంగ్ గా విడుదల చేశారు. అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ కంప్లీట్ అయ్యి ఎండ్ టైటిల్స్ పడే టైములో ఈ పాట వస్తుంది. ప్రమోషన్లకు ఫుల్ సాంగ్ ను ఉపయోగించలేదు.

అయితే థియేట్రికల్ వెర్షన్ కు వచ్చేసరికి ఈ పాట 4 నిమిషాల 4 సెకండ్లు ఉంటుంది. ఎన్టీఆర్,చరణ్, ఆలియా భట్ లు ఉన్న వెర్షన్ ను మనం రిలీజ్ కు ముందు చూసాం. కానీ ఇప్పుడు ఈ ఎక్స్టెండెడ్ వెర్షన్లో అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, రాజమౌళి వంటి వారు కూడా కనిపిస్తారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటని విశాల్ మిశ్రా, పృథ్వి చంద్ర, ఎం.ఎం.కీరవాణి, సాహితి చాగంటి, హారికా నారాయణ్ వంటి వారు ఈ పాటని హుషారెత్తించే విధంగా పాడారు.

కీరవాణి అందించిన ట్యూన్ కూడా బాగుంటుంది. కానీ అల్లూరి, కొమరం భీమ్ లు తమ సొంత ప్రదేశాలకు చేరుకొని అక్కడి జనాలను పలకరించే సన్నివేశాలు మాత్రం ఈ వీడియో సాంగ్లో జత చేయలేదు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news