ఈ మధ్యకాలంలో చాలా మంది హీరోయిన్లు సీక్రెట్ గా పెళ్లి చేసేసుకుంటున్నారు. రీసెంట్ గా హీరోయిన్ ప్రణీత తన బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడింది. అలానే యామీ గౌతమ్.. దర్శకుడు ఆదిత్యను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మరో బ్యూటీ సైలెంట్ గా పెళ్లి చేసుకొని షాకిచ్చింది. ‘సాహో’లో కీలక పాత్ర పోషించిన ఎవ్లీన్ శర్మ కొంతకాలంగా తుషాన్ బిందీతో డేటింగ్ చేస్తోంది. అలా ఏడాది కాలంగా లవ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న ఈ బ్యూటీ ఇప్పుడు అతడితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.
తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఎవ్లీన్ కొద్దిసేపటి క్రితమే బయటపెట్టింది. అయితే ఆమె పెళ్లి మాత్రం చాలా రోజుల క్రితమే జరిగింది. మే 15 న ఈ జంట పెళ్లి చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పెళ్లి ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఎవ్లీన్ శర్మ. ఎంగేజ్మెంట్ చేసుకున్నప్పుడు కూడా ఎవ్లీన్ ఇలానే చేసింది. 2019 అక్టోబర్ లో సిడ్నీ హార్బర్ దగ్గర్లో వీరి ఎంగేజ్మెంట్ జరిగితే.. అది జరిగిన నెల రోజులకి ఆ విషయాన్ని బయటపెట్టింది ఎవ్లీన్.
ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా అలానే చేసింది. ఇక ఆమె పెళ్లి చేసుకున్న తుషాన్ ఆస్ట్రేలియాలో డాక్టర్ గా పని చేస్తున్నారు. 2018 లో ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా వీరిద్దరికీ పరిచయమైంది. అది ప్రేమగా మారి.. ఇప్పుడు పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటైంది. కరోనా కారణంగా ఈ జంట సింపుల్ గా పెళ్లి చేసుకుంది. ఎవ్లీన్ శర్మ.. ‘ఏ జవానీ హై దీవాని’, ‘యారియన్’ సహా పలు చిత్రాల్లో నటించింది.
1
2
3
4
5
6
7
8
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!