సినిమాలో ఇవి కూడా పాత్రలే

  • January 10, 2018 / 12:31 PM IST

సినిమా చూసి బయటికి వచ్చిన తర్వాత.. హీరో గురించి.. హీరోయిన్ గురించి… విలన్ గురించి.. ఇంకా అయితే క్యారక్టర్ ఆర్టిస్టు గురించి మాట్లాడుకుంటాము. కానీ వస్తువుల గురించి మాట్లాడుకుంటామా? .. మాట్లాడుకుంటాము.. ఎందుకంటే అవి మాట్లాడాయి కనుక.. మౌనంగా ఉండి అవి మనకి ఎన్నో చెప్పాయి కనుక.. కథని మలుపు తిప్పిన కొన్ని క్యారెక్టర్స్ పై ఫోకస్..

1. చేప (అ!) విభిన్నమైన కథతో తెరకెక్కుతోన్న “అ!” సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అయినా టీజర్ రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో కథే హీరో అని చేప చెబుతుంది. ఆ చేపకి నాని వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో ఈ సినిమాలో చేప కీలకం కానుంది.

2. బోన్సాయ్ చెట్టు (అ!) “అ!” సినిమాలో బోన్సాయ్ చెట్టు కూడా ప్రేక్షుకుల మదిలో నిలిచి పోనుంది. ఇది కూడా మాట్లాడుతుంది. ఆ మాటలు ఎవరివో కావు.. రవితేజది. మాస్ మాహారాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారంటే ఆ చెట్టు కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

3. సైకిల్ (మర్యాద రామన్న) మర్యాద రామన్న సినిమాలో హీరోకి ఫ్రెండ్ గా సైకిల్ నటించింది. ఆ సైకిల్ కి రవితేజ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో అదొక పాత్రగా గుర్తుండిపోయింది. సినిమా మధ్యలో సైకిల్ కనిపించకపోయినా క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చి చప్పట్లు అందుకుంది.

4. వాచ్ (24 )సూర్య త్రి పాత్రాభినయం చేసిన 24 చిత్రంలో వాచ్ కీలకం. అదే హీరో అని చెప్పాలి. ఆ వాచ్ మీదుగానే ప్రతి సన్నివేశం ఉంటుంది. సో అలా అదొక క్యారక్టర్ అయింది.

5. డైరీ (సాహసం)గోపిచంద్ నటించిన సాహసం సినిమాలో డైరీ మూలంగానే కథ సాగుతుంది. సగం కథ అందులోనే ఉంటుంది. నిధి దాచుకున్న ప్లేస్ ని అందులోనే రాసి ఉంటారు. దాని ప్రకారం వెతుక్కుంటూ పాకిస్థాన్ కి వెళ్తారు.

6. క్లాక్ టవర్ (మనం) అక్కినేని క్లాసిక్ సినిమా మనంలో రెండు తరాల వారు విడిపోవడానికి, కలవడానికి క్లాక్ టవర్ ని ఆధారం చేసుకున్నారు డైరక్టర్ విక్రమ్. అలాగే సమంతకు గతం గుర్తుకు రావడానికి కూడా క్లాక్ టవర్ కారణం అవుతుంది.

7. సెల్ ఫోన్ (హలో )అఖిల్ రెండో చిత్రం హలో మూవీలో సెల్ ఫోన్ మెయిన్ క్యారక్టర్ అయింది. ఆ ఫోన్ కోసం హీరో చాలా కష్టపడుతాడు. పైగా హలో అనే టైటిల్ కూడా సెల్ ఫోన్ కి సంబంధించిందే.

8. రుద్రాక్ష (దువ్వాడ జగన్నాధం)దువ్వాడ జగన్నాధం చిత్రంలో మెడలో రుద్రాక్ష ఉన్నంత సేపు ఎవరిని చంపకూడదని అల్లు అర్జున్ చిన్నప్పుడే తండ్రికి ప్రామిస్ చేస్తాడు. ఆ మాట ప్రకారమే చివరి వరకు రుద్రాక్ష ఉన్నంత సేపు ఎవరి కొట్టడు. పైగా రుద్రాక్షను వేరొకరి చేత తీయించి ఫైట్ మొదలు పెడుతాడు.

9. చెప్పు (ఫిదా) హీరోకి హీరోయిన్ చెప్పు చూపించడం… అసలు ఆ థాట్ రావడం ఓకే.. మెగా హీరోకి ఆ సీన్ పెట్టడం ఆశ్చర్యం కలిగించింది. ఫిదాలో వరుణ్ ప్రేమిస్తున్నాని చెప్తే సాయి పల్లవి చెప్పు ఫోటో పంపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకోవడం.. వాల్ పేపర్ లా పెట్టుకోవడంతో.. చెప్పు చెప్పుకునే క్యారక్టర్ అయింది.

10. సైకిల్ చైన్ (శివ) శివ సినిమా పేరు చెప్పగానే సైకిల్ చైన్ పట్టుకున్న నాగార్జున ఒక మెరుపులా కనిపిస్తాడు. అంతలా చైన్ ఆ సినిమాలో పాపులర్ అయింది.

ఇలా కథలో కీలకమైన వస్తువులు మీకు ఏదైనా అనిపిస్తే కామెంట్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus