Nagarjuna: ఎవర్‌గ్రీన్‌ నిన్నేపెళ్లాడుతా గురించి ఆస్తక్తికర విషయాలు!

తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు ప్రేమకథలు చాలానే వచ్చాయి. అయితే వాటిలో మరపురానివి మాత్రం కొన్నే ఉంటాయి. అలాంటి వాటిలో ‘నిన్నే పెళ్లాడతా’ ఒకటి. ప్రేమ, కుటుంబం… అనే రెండు కాన్సెప్ట్‌లను కలిపి ఒకే సినిమాలు చూపించడం అంత ఈజీ కాదు. అందులోనూ ఇప్పుడు చూసినా… ఫ్రెష్‌నెస్‌ ఉట్టిపడేలా తీయడం చాలా కష్టం. కానీ దీన్ని చేసి చూపించారు కృష్ణవంశీ. ఆర్జీవీ స్కూలు నుండి వచ్చినా… తనదైన శైలిలో చేసి వావ్‌ అనిపించారు. అలా ఎవర్‌గ్రీన్‌ లవ్‌స్టోరీగా నిలిచిన ఈ సినిమా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఆసక్తికర విషయాలు మీ కోసం…

* సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే నాగార్జున-టబు కెమిస్ట్రీ, కృష్ణవంశీ అదిరే టేకింగ్‌, సందీప్‌ చౌతా సూథింగ్‌ సంగీతం సినిమాకు హైలైట్‌. ఇందులో కనిపించిన ప్రతి పాత్ర ఇప్పటికీ గుర్తుంటుంది.

* ‘గులాబీ’షూటింగ్‌ జరుగుతుండగా పాటలు షూటింగ్‌ చూసిన నాగార్జున ఒక రోజు కృష్ణవంశీని పిలిచి ‘నాతో సినిమా చేస్తావా’ అని అడిగారట. ‘మీరు నాతో చేస్తారా’ అని కృష్ణవంశీ బదులిచ్చారట.

* ఆ తర్వాత మంచి యాక్షన్‌ కథను నాగార్జునకు వినిపించారట కృష్ణవంశీ. నాగ్‌కు నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశారు. కానీ ఆ తర్వాత కృష్ణ వంశీ మనసు మార్చుకున్నారట.

* నేను మీకు చెప్పిన కథతో సినిమా చేయను. మరో కథ చెబుతా అని అన్నారట కృష్ణ వంశీ. దాంతో నాగార్జున అసహనం వ్యక్తం చేశారట. కానీ ఆ తర్వాత నాగార్జునకు ‘నిన్నే పెళ్లాడతా’ పాయింట్‌ వినిపించారట కృష్ణవంశీ. దీనికి కూడా నాగ్‌ ఓకే అన్నారట. అలా సినిమా పట్టాలెక్కింది.

* హీరోయిన్‌ పాత్ర కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 60 మందికిపైగా అమ్మాయిల్ని పరిశీలించారట. ఎవరూ సెట్‌ అవుతారని అనిపించకపోవడంతో టబు అయితే బెటర్‌ అని తీసుకున్నారట.

* సినిమాల శీను (నాగార్జున), పండు (టబు) జంట బంపర్‌ హిట్ అయింది. ఇప్పటికీ ఆ పేర్లు సినిమాలాగే బహురుచిగా ఉంటాయి.

* సినిమాలోని ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ పాట ఆల్‌టైమ్‌ సూపర్‌హిట్‌. ‘గ్రీకువీరుడు’పాట కొన్నాళ్లపాటు అమ్మాయిలు హమ్‌ చేస్తూనే ఉన్నారు.

* ‘నిన్నే పెళ్లాడతా’ తర్వాత చాలామంది నిర్మాతలు తమతో ఇలాంటి సినిమా తీయమని కృష్ణవంశీకి బ్లాంక్‌ చెక్కులు ఇచ్చారట.

* నాగార్జున కెరీర్‌లో మొదటి సిల్వర్‌ జూబ్లీ సినిమా ఇది! 39 సెంటర్స్‌లో 100 రోజులు, 4 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది.

* ఈ సినిమా ఆ రోజుల్లో రూ.12కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని అంటుంటారు. ఇప్పటి లెక్కల్లో చూస్తే వామ్మో అనుకోవాల్సిందే.

* ఈ సినిమాకు ఉత్తమ జాతీయ చిత్రం (తెలుగు) పురస్కారం కూడా లభించింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus