Amitabh: అభిమానులు అంటే అమితాబ్ కి అంత గౌరవమా.. చెప్పులు లేకుండా ఆ పని చేస్తారా?

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా ఈయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి ఇలా తనని ఎంతగానో అభిమానించే అభిమానుల కోసం ఏ సెలబ్రిటీ కూడా చేయని పని అమితాబ్ చేస్తున్నారని తెలిసి ఆయనకు అభిమానులు అంటే ఎంత గౌరవము ఉందో తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా అభిమానులు తమ అభిమాన హీరోని కలవాలని చూడాలని కోరుకుంటారు.

ఈ క్రమంలోనే అమితాబచ్చన్ కోసం ప్రతి ఆదివారం తన ఇంటి ముందు వందల సంఖ్యలో అభిమానులు వస్తుంటారని తెలుస్తోంది. అభిమానులను కలవడం కోసం ప్రతి ఆదివారం ఉదయం కొంత సమయం పాటు జల్సాలో ఉన్నటువంటి తన ఇంటి బాల్కనీలో అమితాబ్ నిలబడి అక్కడికి వచ్చినటువంటి అభిమానులకు అభివాదం చేయడమే కాకుండా వారితో ముచ్చటిస్తారని తెలుస్తోంది. అయితే ఈ ఆచారం ఇప్పుడు వచ్చినది కాదు. గత 50 సంవత్సరాల నుంచి ఈ ఆచారం కొనసాగుతూనే ఉందట.

ఇక అమితాబ్ (Amitabh) పొరపాటున కూడా షూటింగ్ పనుల నిమిత్తం ఆదివారం ముంబైలో కనుక లేకపోతే ఈయన ఇదే విషయాన్ని రెండు రోజులు ముందే ఈ విషయాన్ని తెలియజేస్తారని తెలుస్తోంది. ఈ విధంగా అభిమానుల కోసం ఈయన ప్రతి ఆదివారం ఉదయం కొంత సమయం కేటాయించి వారిని కలుస్తారట. అయితే ఈ విధంగా అభిమానులను కలిసే సమయంలో ఈయన చెప్పులు లేకుండా వారికి కనబడతారని తెలుస్తోంది. మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే చెప్పులు బయట వదిలేసి దేవుడిని దర్శించుకోవడానికి వెళ్తాము.

అలాగే ప్రతి ఆదివారం నా ఇంటి ముందు ఎంతోమంది అభిమానులు ఉంటారు వాళ్లే నాకు దేవుళ్ళతో సమానం అందుకే వారిని కలవాలనుకున్న సమయంలో తాను చెప్పులు వేసుకోనంటూ ఓ సందర్భంలో బిగ్ బీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈయన ఈ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్టుకే సినిమాతో పాటు పలు బాలీవుడ్ సినిమాలతో కూడా ఈయన బిజీగా ఉన్నారు.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus