ఇప్పుడంటే ప్రకాష్ రాజ్ మా ఎలక్షన్స్ లో నిల్చున్నాడని కొందరు దర్శకనిర్మాతలు అతనికి సపోర్ట్ చేస్తున్నారు కానీ.. ఒకానొక దశలో ప్రకాష్ రాజ్ ను ఏకంగా ఆరు సార్లు బ్యాన్ చేశారు చిత్ర పరిశ్రమ నుంచి. నిర్మాతలను రెమ్యూనరేషన్ విషయంలో అతను పెట్టే ఇబ్బందుల వల్ల కావచ్చు లేదా సెట్లో దర్శకులకు చిరాకు పుట్టించే విధానం వల్ల కావచ్చు.. ప్రకాష్ రాజ్ మీద పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు. తెలుగు సినిమా అదృష్టం కొద్దీ రావు రమేష్ దొరికి.. ప్రకాష్ రాజ్ కి ఆల్టర్నేటివ్ గా మారిపోయాడు కానీ..
అప్పటివరకూ తండ్రి పాత్రలంటే ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలడు అని తెగ నమ్మేసేవారు మన టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్. ప్రకాష్ రాజ్ తాను పోషించే పాత్రలకు ప్రాణం పోసే విధానం కూడా బాగుండేది అనుకోండి. ఇక అసలు విషయానికి వస్తే.. మా ఎలక్షన్స్ మరో మూడు రోజుల్ల జరగనున్న క్రమంలో నిన్న సాయంత్రం సి.వి.ఎల్.నరసింహా రావు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. నిజానికి ఈయన కూడా ప్రెసిడెంట్ గా నామినేషన్ వేసి వెనక్కి తీసుకున్నారు.
అయితే.. ప్రకాష్ రాజ్ కు మాత్రం ఓటేయ్యకండి అని ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతున్నాడాయన. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీని కూడా ఇందులోకి లాగారు. బండి సంజయ్ కు కూడా ప్రకాష్ రాజ్ గెలవడం అస్సలు ఇష్టం లేదని. ప్రకాష్ రాజ్ ఓ వైరస్ లాంటోడు అని స్పందించారు. ఆల్రెడీ సీనియర్ హీరోలు, ఆర్టిస్టులు మంచు విష్ణు ప్యానల్ కు సపోర్ట్ చేస్తుండగా.. ఇప్పుడు భాజాపా ఇన్వాల్వ్ మెంట్ తో ప్రకాష్ రాజ్ కి నెగిటివిటీ పెరిగింది. మెల్లమెల్లగా ప్రకాష్ రాజ్ ప్యానల్ గెలుస్తుందన్న నమ్మకం అందరిలో సన్నగిల్లుతోంది.