Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హోస్ట్ నాగార్జునపై నెటిజన్స్ ట్రోలింగ్..నాగార్జున చేసిన తప్పేంటి ?

బిగ్ బాస్ హౌస్ లో శనివారం ఎపిసోడ్ రచ్చ రంబోలా రేపుతోంది. ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచీ హోస్ట్ నాగార్జున సన్నీని టార్గెట్ చేశారంటూ ట్రోల్స్ మొదలు అయ్యాయి. ప్రోమోలో చూపించినట్లుగానే నాగార్జున తీర్పు వన్ సైడ్ ఇచ్చేసరికి నెటిజన్స్ హోస్ట్ ని ఆడేసుకుంటున్నారు. రిప్ బిగ్ బాస్ సీజన్ 5 అంటూ యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ఎఫ్ ఐ ఆర్ అంటూ హౌస్ మేట్స్ తో పంచాయితీ మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మిగిలిన ఇంటి సభ్యులు గిల్టీ నా నాట్ గిల్టీనా అని చెప్పాల్సి ఉంటుంది. అనీమాస్టర్ కాజల్ ని నిలబెడితే, తిరిగి కాజల్ దోషిగా అనీమాస్టర్ ని నిలబెట్టింది. వారిద్దరిమద్యలో వచ్చిన ఇష్యూని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆర్గ్యూమెంట్ ఎక్కువైపోయింది.

ఆ తర్వాత రవి సన్నీ ప్రవర్తన బాగోలేదంటూ ఆరోపణ చేశాడు. టాస్క్ ఆడేటపుడు, ముఖ్యంగా కోపంలో సన్నీ మాటలు సరిగ్గా మాట్లాడట్లేదంటూ నిందించాడు. తంతా అనడం, అప్పడం అయిపోతావ్ అనడం, అమ్మేస్తా అని మాట్లాడటం కరెక్ట్ కాదంటూ చెప్పాడు. దీనిపైన సన్నీ రవితో ఆర్గ్యూమెంట్ చేశాడు. మద్యలో కాజల్ సన్నీ ఉద్దేశ్యం వేరని చెప్తూ, కావాలని అతను మాట్లాడలేదంటూ చెప్పింది. ఇక్కడే నాగార్జున కాజల్ నోరు మూయించే ప్రయత్నం చేశారు. కాజల్ చెప్పింది కరెక్ట్ కాదంటూ హోస్ట్ నాగార్జున వన్ సైడ్ తీర్పు ఇచ్చేశారు. దీంతో సన్నీ ఫ్యాన్స్ ఇప్పుడు నాగార్జున బిగ్ బాస్ యాంకరింగ్ వదిలేయమంటూ ట్రోల్స్ స్టార్ట్ చేశారు.

మరోవైపు సన్నీ కి , షణ్ముక్ జస్వంత్ కి కూడా ఆర్గ్యూమెంట్ అయ్యింది. షణ్ముఖ్‌, సిరిలు కూడా సన్నీపై నిందలు వేస్తూ దోషిగా నిలబెట్టారు. నాగార్జున ఇక్కడ ఒకటి రెండు పదాలు మాత్రమే పట్టుకుని నువ్వు అన్నావా లేదా.. అన్నావా లేదా అంటూ వాటిపైనే ఒత్తిడి తెచ్చారు. దీంతో సన్నీ సారీ చెప్పక తప్పలేదు. అంతేకాదు, ఇక్కడ సన్నీకి సపోర్ట్ గా మాట్లాడిన కాజల్ ని సైతం లెక్కచేయలేదు. ఇక షణ్ముక్ ఆడవాళ్లని పెట్టుకుని గేమ్ ఆడుతున్నావ్ అనడం నచ్చలేదని, యూట్యూబ్ కి మాత్రమే నువ్వు అనే పదం కూడా నోరుజారాడని ఆరోపణలు చేశాడు. ఇక్కడే సన్నీని టార్గెట్ చేశారు అందరూ. దీంతో చేసేందేం లేక సన్నీ మాట్లాడలేదు. హోస్ట్ నాగార్జున ఇలా వన్ సైడ్ మాట్లాడటం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus