Revanth: ఆదిరెడ్డి – ఫైమా ఆపరేషన్ సక్సెస్..! ఎవరు ఎవర్ని నామినేట్ చేశారంటే.?

బిగ్ బాస్ హౌస్ లో 13వ వారం నామినేషన్స్ లో రేవంత్ టార్గెట్ అయ్యాడు. రేవంత్ తో పాటుగా, ఆదిరెడ్డికి ఇంకా రోహిత్ కి కూడా ఎక్కువ ఓట్లు రావడం విశేషం. అంతేకాదు, ఈసారి శ్రీహాన్ ని ఎవరూ నామినేట్ చేయలేదు. అలాగే ఇనయా కెప్టెన్ కాబట్టి ఎవరూ నామినేట్ చేయకూడదు. నామినేషన్స్ కంటే ముందు ఏం జరిగిందంటే., హౌస్ లో శ్రీసత్య విషయంలో నా విషయంలో నువ్వు ఎక్కువ నోరుజారుతున్నావ్ అంటూ శ్రీహాన్ రేవంత్ కి వార్నింగ్ ఇచ్చాడు. సిరి కూడా వచ్చి చెప్పింది,

కోపం వచ్చిందంటే ఆడియన్స్ కి బ్యాడ్ గా వెళ్తుందని, కేవలం నీ మాటల వల్లే నేను హర్ట్ అవుతున్నానని చెప్పాడు. అలాగే, రేవంత్ టీజ్ చేస్తుంటే తీస్కోలేకపోతున్నా అంటూ శ్రీహాన్ శ్రీసత్యతో బాధపడ్డాడు. ఇక రేవంత్ ఆదిరెడ్డి ఫైమా ఇద్దరితో మాట్లాడుతూ కీర్తి గేమ్ గురించి మాట్లాడాడు. కీర్తి గేమ్ లో వేలుకి దెగ్గతగలడం వల్ల ఈవారం పెద్దగా ఆడలేదని ఫస్ట్ చెప్పాడు. కానీ బాగా ఆడుతోందిలే అని ఆదిరెడ్డి అనగానే మాట మార్చాడు. కీర్తి ఎమోషనల్ మాత్రమే జనాలు చూశారని, అలాగే వేలు బాగోకపోయినా ఆడుతోందని, ప్రయత్నిస్తోందని చెప్పాడు. ఈవిషయంపై నామినేషన్స్ లో పెద్ద ఫైట్ అయ్యింది.

బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎవరిని నామినేట్ చేశారంటే.,

ఆదిరెడ్డి – రేవంత్ ని ఇంకా రోహిత్ ని నామినేట్ చేసాడు.
ఫైమా – రేవంత్ – రోహిత్
శ్రీహాన్ – రోహిత్ – ఆదిరెడ్డి
కీర్తి – రేవంత్ – శ్రీసత్య
శ్రీసత్య – కీర్తి – ఆదిరెడ్డి
రోహిత్ – ఆదిరెడ్డి – ఫైమా
రేవంత్ – ఆదిరెడ్డి – ఫైమా
ఇనయా – రేవంత్ ని ఇంకా శ్రీసత్యని నామినేట్ చేసింది.

ఈవారం ఖచ్చితంగా టఫ్ ఫైట్ అనేది ఉండబోతోంది. ఎందుకంటే, టిక్కెట్ టు ఫినాలే రేస్ అనేది స్టార్ట్ అవుతోంది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ మంచుతో బొమ్మలని కట్టాల్సి ఉంటుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ల నెక్ట్స్ లెవల్ కి వెళ్తారు. మరి వీళ్లలో ఎవరు గెలిచారు అనేది చూడాలి. అలాగే, ఈవారం నామినేషన్స్ లో ఎక్కువగా రేవంత్ కి , ఆదిరెడ్డికి ఓట్లు పడ్డాయి. ముఖ్యంగా రేవంత్ ని టార్గెట్ చేస్తూ ఆదిరెడ్డి ఇంకా ఫైమా ఇద్దరూ విరుచుకుపడ్డారు.

కీర్తి విషయం, అలాగే తను అన్నమాటల్ని ఎలా మారుస్తాడు అనేది క్లియర్ గా నిరూపించే ప్రయత్నం చేశారు. రేవంత్ ని కొద్దిగా రెచ్చగొడితే ఖచ్చితంగా నోరుజారతాడు. కోపం వచ్చేస్తుంది. అదే పాయింట్ తో ఆదిరెడ్డి ఇంకా ఫైమా ఇద్దరూ కూడా రేవంత్ ని రెచ్చగొట్టే ప్రయత్నమే చేశారు. కానీ, ఈసారి రేవంత్ మాటకి మాట చెప్తూ లాజిక్స్ వర్కౌట్ చేశాడు. వాళ్ల ఎత్తుగడని తిప్పికొట్టాడు. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ రేవంత్ ఫైమాకి వార్నింగ్ ఇచ్చాడు.

అలాగే ఫైమా కూడా వేలు చూపిస్తూ రేవంత్ పైకి వెళ్లింది. ఇక ఆదిరెడ్డి అయితే తన మాటలతోనే రెచ్చగొట్టాడు. రేవంత్ కి ఆదిరెడ్డికి మాటల యుద్ధం జరిగింది. అలాగే, శ్రీహాన్ కి ఆదిరెడ్డికి కూడా గట్టిగా పడింది. ఏది ఏమైనా ఈవారం నామినేషన్స్ హీటెక్కించాయనే చెప్పాలి. మరి వీళ్లలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఆసక్తికరం. అదీ మేటర్.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus