టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ను కొంతమంది జీనియస్ డైరెక్టర్, క్రియేటివ్ డైరెక్టర్ అంటుంటారు. ఎందుకంటే ఈయన సినిమాల్లో హీరోలు తిక్క తిక్కగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడటానికి ఒక సబ్జెక్ట్ కూడా ఉంటుంది. అందుకే సుకుమార్ సినిమాల్లో హీరోయిజం భిన్నంగా ఉంటుంది. ఆడియన్స్ ఒక దశాబ్ద కాలం పాటు గుర్తుపెట్టుకునే విధంగా కూడా ఉంటుంది అనడంలో సందేహం లేదు.
అంతేకాకుండా సుకుమార్ సినిమాల్లో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంటుంది. అదే టైటిల్ కార్డ్స్. హడావిడి హడావిడిగా టైటిల్స్ రావు. చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ టైటిల్ కార్డ్స్ తోనే ఆడియన్స్ ని కట్టిపడేస్తాడు సుకుమార్. అందుకే అతని క్రియేటివిటీని చాలామంది ఇష్టపడుతుంటారు. అందులో రాజమౌళి వంటి నెంబర్ వన్ డైరెక్టర్ కూడా సుకుమార్ క్రియేటివిటీని ఇష్టపడతారు అంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి జనరేషన్ కి తెలియకపోవచ్చు కానీ సుకుమార్ ని మించిన క్రియేటివిటీ దివంగత ఈవీవీ సత్యనారాయణ సొంతం.
ఇది డైజెస్ట్ చేసుకోవడానికి కష్టంగా ఉన్నా.. ఇది నిజం. జంధ్యాల వద్ద శిష్యరికం చేయడం వల్లనో ఏమో కానీ ఈవివి సత్యనారాయణ పెన్ పవర్ కి చాలా పవర్ ఉంటుంది. ఈవీవీ డైరెక్టర్ అయిన తర్వాత జంధ్యాల ఫేడౌట్ అయిపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు ఈవీవీ క్రియేటివిటీ ఎలాంటిదో అని.! ఈవీవీ కూడా టైటిల్ కార్డ్స్ డిఫరెంట్ గా వేస్తుండేవారు. అవి భలే గమ్మత్తుగా కూడా అనిపిస్తుంటాయి.
1992 చేసిన ‘ఆ ఒక్కటి అడక్కు’, ‘జంబలకిడిపంబ’, 1994 లో చేసిన ‘హలో బ్రదర్’ వంటి సినిమాల్లో టైటిల్ కార్డ్స్ చాలా కొత్తగా ఉంటాయి. అవి చదువుతుంటేనే మన పెదాలపై చిరునవ్వు వికసిస్తుంది. మరీ ముఖ్యంగా 1999 లో శ్రీకాంత్ ‘పిల్ల నచ్చింది’ అనే సినిమా చేశారు ఈవీవీ. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ చూస్తే కచ్చితంగా ఆకర్షితులు అయిపోతారు అనడంలో సందేహం లేదు. నేటితో ‘పిల్ల నచ్చింది’ రిలీజ్ అయ్యి 26 ఏళ్లు పూర్తి కావస్తోంది.
#EVV gari title cards are different genre only @AnilRavipudi anna can try these type of different title cards in present era https://t.co/G2jnylelop pic.twitter.com/0YtFCUZOti
— Bhargav Kunireddy (@K_BhargavTweets) January 22, 2025