పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువగా విగ్రహారాధన చేస్తుంటారు. ఆయనకు కూడా సెంటిమెంట్లు ఎక్కువే. తన సినిమాల్లో ముఖ్యంగా క్లైమాక్స్ లో కనుక ‘బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తే సినిమా హిట్ అవుతుంది’ అనే సెంటిమెంట్ పవన్ కళ్యాణ్ కి ఎక్కువగానే ఉంటుంది. ఇక సినీ పరిశ్రమలో ఉండే సెంటిమెంట్ల గురించి కొత్తగా చెప్పేది ఏముంది. కొబ్బరి కాయ కొట్టడానికి.. గుమ్మడి కాయ కొట్టి సినిమా రిలీజ్ చేయడానికి.. చాలా సెంటిమెంట్లు ఫాలో అవుతారు మేకర్స్.
ముఖ్యంగా నిర్మాతలు ఈ విషయంలో అస్సలు తగ్గరు అనే చెప్పాలి. అభిమానులు ఏమీ తక్కువ కాదు. వాళ్ళు కూడా తమ అభిమాన హీరో సినిమా విషయంలో బోలెడన్ని సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. పొరపాటున సినిమా అనుకున్న డేట్ కి రిలీజ్ అవ్వకపోతే ఎంత రచ్చ చేస్తారో.. కలిసిరాని డేట్ కి రిలీజ్ చేసినా కూడా అంతే రచ్చ చేస్తారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానులకి ఓ డేట్ మాత్రం అస్సలు కలిసి రాలేదు.
వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఫస్ట్ ప్లాప్ మూవీ అంటే.. ఎవ్వరైనా తడుముకోకుండా ‘జానీ’ అనే చెబుతారు. ‘ఖుషి’ తర్వాత 2 ఏళ్ళు గ్యాప్ తీసుకుని పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఇది. దీనికి దర్శకుడు కూడా పవన్ కళ్యాణ్ కావడం విశేషం. అయితే ఈ సినిమా దారుణంగా ప్లాప్ అయ్యింది. దీంతో పవన్ కళ్యాణ్ తన రెగ్యులర్ పంధాలోకి వచ్చి ‘గుడుంబా శంకర్’ అనే సినిమా చేశాడు.
2004 సెప్టెంబర్ 10న రిలీజ్ అయిన ఈ సినిమా కచ్చితంగా హిట్టు కొట్టి.. ‘జానీ’ ఫలితాన్ని మరిపిస్తుంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భావించారు. కానీ ఈ సినిమా కూడా ప్లాప్ అయ్యింది. వీర శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక తర్వాత అంటే దాదాపు 6 ఏళ్ళ తర్వాత.. 2010 సెప్టెంబర్ 10కి ‘కొమరం పులి’ రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు ఈ సినిమాపై భారీ హైప్ ఉంది.
ఎందుకంటే ‘ఖుషి’ వంటి ఆల్ టైం హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ – ఎస్ జె సూర్య కాంబినేషన్లో రూపొందిన సినిమా ఇది. కానీ ఇది కూడా డిజాస్టర్ అయ్యింది. సో అలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను సెప్టెంబర్ 10 2 సార్లు డిజప్పాయింట్ చేసింది అని చెప్పాలి.