ఆకట్టుకుంటున్న ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ హీరోయిన్..!

అవును టాలీవుడ్ ప్రేక్షకులకి మరో క్రష్ దొరికేసినట్టే..! అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత బాగా ఉంది. మీడియం హీరోల పక్కన చేసిన భామలు నాలుగు ప్లాపులు పడిన వెంటనే మిగిలిన ఇండస్ట్రీకి చెక్కెయ్యడానికి చూస్తున్నారు. అంతే కానీ మళ్ళీ తక్కువ రెమ్యూనరేషన్ కి మీడియం హీరోల పక్కన చేయడానికి ముందుకు రావడం లేదు. పైగా నటన తెలిసిన హీరోయిన్ల కోసం గాలిస్తూ విసిగిపోతున్నారు దర్శకనిర్మాతలు. అలాంటి పరిస్థితుల్లో నభా నటేష్, ప్రియాంక అరుళ్ మోహన్(నానిన్ గ్యాంగ్ లీడర్ ఫేమ్) దొరికారు. ఇప్పుడు ప్రతిభ ఉన్న మరో హీరోయిన్ కూడా దొరికింది. కుర్ర కారుకి ఈ అమ్మడు తెగ నచ్చేసింది.

ఆమె ఎవరో కాదు ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రం ద్వారా పరిచయం కాబోతున్న గార్గేయి ఎల్లా ప్ర‌గ‌డ. ఇప్పటికే విడుదల చేసిన ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ టీజర్, ట్రైలర్ లో ఈమె క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ భామ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏమైనా ప్రేక్షకులకి మరో క్రష్ దొరికేసినట్టే. ‘బాహుబలి2’ ఫేమ్ రాకేష్ వర్రె హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 8 న (రేపు) విడుదల కాబోతుంది. దిల్ రాజు రిలీజ్ చేస్తున్న ఈ చిత్రానికి బసవ శంకర్ దర్శకుడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus