అక్టోబ‌ర్ 8 న `ఎవ్వ‌రికీ చెప్పొద్దు` చిత్రాన్ని విడుద‌ల చేస్తున్న‌ నిర్మాత దిల్‌రాజు!

స్టార్ హీరోల సినిమాలే కాదు.. మంచి క‌థా బ‌ల‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌మిచ్చే నిర్మాత‌ల్లో దిల్‌రాజు ఒక‌రు. చిన్న సినిమాల‌కు, కొత్త ద‌ర్శ‌కుల‌కు, యంగ్ టాలెంట్‌కు ఆయ‌న అందించే స‌పోర్టే ఆయ‌న్ని టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టింది. హిట్ చిత్రాల నిర్మాత‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన దిల్‌రాజు `ఎవ్వ‌రికీ చెప్పొద్దు` అనే ప్రేమ‌క‌థా చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు

క్రేజీ యాంట్స్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాకేష్ వ‌ర్రె, గార్గేయి ఎల్లాప్రగ‌డ హీరో హీరోయిన్లుగా బ‌స‌వ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రాకేష్ వ‌ర్రె నిర్మాణంలో రూపొందిన ల‌వ్‌స్టోరీ `ఎవ్వ‌రికీ చెప్పొద్దు` ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై దిల్‌రాజు తెలుగులో అక్టోబ‌ర్ 8 న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ..

హీరో, నిర్మాత రాకేష్ వ‌ర్రె మాట్లాడుతూ – “హార్ట్ ట‌చింగ్ ల‌వ్ స్టోరీస్‌ను తెలుగు ప్రేక్ష‌కులు అద్భుతంగా ఆద‌రిస్తుంటారు. అలాంటి రొమాంటిక్ కామెడీ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకి వ‌స్తున్నాం. సినిమాకు సంబంధించిన అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. దిల్‌రాజు గారు మా సినిమాను అక్టోబ‌ర్ 8 న రిలీజ్ చేస్తున్నాం . ఆయ‌న అందిస్తున్న స‌హ‌కారానికి .. ఆయ‌న‌కు స్పెష‌ల్ థాంక్స్‌. సినిమా త‌ప్పకుండా అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus