‘భీష్మ’ ‘హిట్’ చిత్రాలకు అదొక మైనస్ అయ్యింది..!

ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ ను ఉతికి ఆరేసాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అమ్మిన దానికి ఓ 30 శాతం పైనే ఆ సినిమాలు రికవరీ చేసాయి. ఇద్దరి హీరోల కెరీర్లలోనూ బిగ్గెస్ట్ హిట్ లు గా నిలిచాయి. ఆ తరువాత ఆ సినిమాల స్థాయిలో కాకపోయినా.. కనీసం థియేటర్లకు రప్పించిన సినిమాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి రెండు సినిమాలు మాత్రమే అని చెప్పాలి. ‘డిస్కో రాజా’ ‘జాను’ ‘వరల్డ్ ఫేమస్’ వంటి క్రేజీ చిత్రాలు హిట్ అవుతాయి కనీసం కమర్షియల్ గా వర్కౌట్ అవుతాయి అనుకుంటే.. పెద్ద బిస్కట్ వేసాయి.

ఆ టైం లో ‘భీష్మ’ సినిమా వచ్చి కాస్త ఊరటను ఇచ్చింది. మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించింది కాబట్టి… నితిన్ కెరీర్లో ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ రెండో ఈ చిత్రం జోరు తగ్గిపోయింది… అలా అని తీసి పారేసే రేంజ్లో అయితే పడిపోలేదు. ఇక రెండో చిత్రం ‘హిట్’. లో బడ్జెట్ లో సినిమాలు తీసి పంపిణీలు చేసినంత మాత్రాన హిట్ అవుతాయి అని చెప్పలేము. కానీ ‘హిట్’ చిత్రం మొదటి 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. కానీ ఇప్పుడు సో సోగానే పెర్ఫార్మ్ చేస్తుంది. అందుకు కారణం ఎగ్జామ్స్ సీజన్ అనే చెప్పాలి. లేకపోతే ఈ చిత్రాలు మరింతగా కలెక్ట్ చేసేవి అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Most Recommended Video

పలాస 1978 సినిమా రివ్యూ & రేటింగ్!
అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి సినిమా రివ్యూ & రేటింగ్!
ఓ పిట్టకథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus