F3 Movie: సోనీ లివ్ లో ‘ఎఫ్3’.. నాలుగు వారాల తరువాతే!

విక్టరీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన సినిమా ‘F3’. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్స్‌గా న‌టించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, సునీల్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మే 27న ఈ సినిమా విడుదలైంది. కొన్ని చోట్ల ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.

ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చింది. లాజిక్స్ లేనప్పటికీ సినిమా చూడడానికి థియేటర్లకు క్యూ కడుతున్నారు. రెండు రోజులకు గాను ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.18.72 కోట్లను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. రూ.23 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కి సంబంధించిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ‘ఎఫ్3’ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ దక్కించుకుంది.

నాలుగు వారాల థియేట్రికల్ రన్ తరువాతే ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో నెగెటివ్ టాక్ వస్తోన్న సినిమాలను ముందుగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. కానీ ‘ఎఫ్3’ సినిమాని కామెడీ కాపాడేసింది. పైగా దిల్ రాజుఁ నిర్మాత కాబట్టి కనీసం మూడు వారాల పాటు ఈ సినిమాను నడిపించేస్తారు. ఓటీటీ అగ్రిమెంట్ ప్రకారం.. జూన్ చివరి వారంలో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారని సమాచారం.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus