Naatu Naatu: నాటు నాటు పాట గురించి ఈ విషయాలు తెలుసా?

  • March 11, 2023 / 11:37 PM IST

నాటు నాటు అంటూ తెలుగు, తమిళ, కన్నడ హిందీ సినిమా అభిమానులను అలరించిన మన తెలుగు పాట ఇప్పుడు కండలు దాటి…ఆస్కార్స్ వరకు వెళ్ళింది. ఇంకా కొన్ని గంటల్లో నాటు నాటు ఎం చరిత్ర సృష్టిస్తుందో అని మన తెలుగుతో పాటు భారతీయులు వేచి చూస్తున్నారు. ఈ పాట సందర్భం, పాటలో ఉన్న అర్ధం, పాటను తెరకెక్కించిన విధానం, ప్రేమ్ రక్షిత్ డాన్స్, కాల భైరవా, రాహుల్ సిప్లిగంజ్ పాడిన తీరు అన్ని వెరసి ఈ పాటని ఆస్కార్ అదుడిటోరియం వరకు తీసుకోని వెళ్లాయి.

ఆస్కార్ వస్తుందా లేదా? అనే లాంటి విషయాలు పక్కన పెడితే మన ‘నాటు నాటు’ గురించి ఆసక్తికరమైన విషయాలు మీరు కొన్ని తెలుసుకోవాలి…

పాట రాయడానికి అన్ని రోజులు పట్టిందా?

పాట సందర్భం విన్నాక చంద్రబోస్ గారు ఈ పాటను లో సాగం ఒక రోజులోనే రాసేశారు అట. కానీ మిగతా సాగం పాట రాయడానికి బోస్ గారికి ఒక సంవత్సరం పైనే టైం తీసుకోని అనేక మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు మనం వింటున్న వెర్షన్ రాసారు అట.

ఢిల్లీ అనుకున్నారు కానీ యుక్రెయిన్ కి వెళ్లారు…!

 

రాయడం, పాడడం అయిపోయింది… ఇక తెరకెక్కించే విధానంలో జక్కన్న ఎక్కడ రాజీపడలేదు. మొదట నాటు నాటు పాటను ఢిల్లీలో ఉన్న ఎర్ర కోట, లేదా వేరే ఛాతిర్క కట్టడంలో చేద్దాం అనుకున్నారు…కానీ అది కుదరక యుక్రెయిన్ ప్రెసిడెంట్ ప్యాలస్ కి వెళ్లి అక్కడ షూట్ చేసారు.

పట్టిన సమయం, పెట్టిన ఖర్చు…!

నాటు నాటు పాటను యుక్రెయిన్ వెళ్లి అక్కడ 15 రోజులు షూట్ చేసారు…15 రోజులకి గాను 15 కోట్లు పైగా ఖర్చు పెట్టారు. పాటలో ఉన్న వాళ్లంతా ప్రొఫెషనల్ డాన్సర్, వాళ్ళ అందరికి ఫీజు, కాస్ట్యూమ్స్ తో కలిపి చాల పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టారు దానయ్య.

వామ్మో అన్ని టేకుల?

ఈ పాట కోసం డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ తో…రాజమౌళి దాదాపు 80 రకాల హుక్ స్టెప్స్ ప్లాన్ చేసాడు. చివరగా మనం సినిమాలో చుసిన హుక్ స్టెప్ పెట్టి అది చరణ్-తారక్ లతో ఒక 18 టేకులు తీసుకున్నాడు అంట. అంత తీసుకోని చివరకు వాళ్ళు చేసిన 18 టేకుల్లో రెండో సారి చేసిన టేక్ ఒకే చేసారట జక్కన్న.

పాటేంత పని చేసిందంటే?

రామ్ చరణ్ ఈ పాట రిహార్సల్స్ చేస్తూ చేస్తూ 6 రోజుల్లో దాదాపు 4 కిలోలు బరువు తగ్గడు అంట. పాటకు రాజమౌళి ఎంత కష్ట పెట్టాడు ఇది చూస్తే అర్ధం అవుతుంది..కానీ ఆ కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది.

రాజమౌళి హింసించడా?

ఈ పాటలోహుక్ స్టెప్ సైగ సింక్ లో వస్తుందో లేదో తెలుసుకోడానికి రాజమౌళి గారు మానిటర్ లో పదే పదే ఆ హుక్ స్టెప్ ని రివర్స్ చేసి ఫ్రీజ్ చేసి మరి చూసి…తారక్ చరణ్ లను వచ్చే వరకు…రాజీపడకుండా తీసాడు అంట.

ఆ కష్టానికి ఫలితం…గోల్డెన్ గ్లోబ్

ఇక నాటు నాటు కోసం గేయ రచయిత నుండి నటులు, డాన్స్ మాస్టర్స్ వరకు అందరు పడిన కష్టానికి ఫలితం గోల్డెన్ గ్లోబ్ రూపం లో వరించింది. ఒకే భారతీయ -ఆసియా సినిమాలోని పాటలకు గోల్డెన్ గ్లోబ్ రావడం ఇదే మొదటి సారి.

గోల్డెన్ గ్లోబ్ తో ఆగకుండా…ఆస్కార్ వరకు వెళ్ళింది !

ఇక గోల్డెన్ గ్లోబ్ తో సారి కొత్త సృష్టించిన నాటు నాటు పాట…అక్కడితో ఆగకుండా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్ళింది. ఇలా ఒకే భారతీయ సినిమా నుండి ఆస్కార్స్ కి ఎంపికైన పాటల్లో నాటు నాటు మొదటిది. 95 ఏళ్ల ఆస్కార్స్ చరిత్రలో ఒకే భారతీయ సినిమా, భారతీయ సినిమా పాటకి నామినేషన దక్కడం ఇదే మొదటి సారి.

ఇది మన తెలుగు పాట నాటు నాటు చరిత్ర…అవును ఈ పాట చరిత్ర సృష్టించింది. అందుకే ఇంత కంటే సాక్ష్యాలు ఏం కావాలి చెప్పండి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus