Fahadh Faasil: పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • June 15, 2024 / 06:11 PM IST

బన్నీ (Allu Arjun)  సుకుమార్  (Sukumar) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule)  సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని 1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే పుష్ప ది రూల్ సినిమాలో ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) మెయిన్ విలన్ గా కనిపించనున్నారు.

రోజుకు 12 లక్షల రూపాయల చొప్పున ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఒకవేళ తాను డేట్లు ఇచ్చి షూటింగ్ క్యాన్సిల్ అయితే అదనంగా మరో 2 లక్షలు ఇవ్వాలని ఈ నటుడు షరతులు విధించారట. ఈ విధంగా కండీషన్స్ పెట్టడం వల్ల తన డేట్లు వృథా అయ్యే అవకాశం ఉండదని ఈ నటుడు భావిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ రెమ్యునరేషన్ లెక్కలు విని నెటిజన్లు షాకవుతున్నారు.

ఈ నటుడు 50 రోజులు డేట్లు కేటాయించాలంటే 6 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ఒక చిన్న హీరో సినిమా బడ్జెట్ కు సమానం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బన్నీ సుకుమార్ కాంబో మూవీ చెప్పిన తేదీకి విడుదలైతే మాత్రం ఈ సినిమా కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఈ సినిమా విషయంలో మేకర్స్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.

పుష్ప2 సినిమా నుంచి విడుదలైన ప్రతి పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. పుష్ప2 మూవీ కోసం రష్మిక (Rashmika)  ఫ్యాన్స్ సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ బన్నీ కెరీర్ కు ఎంతో కీలకం కాగా ఈ సినిమా ఎంచుకునే ప్రాజెక్ట్స్ విషయంలో బన్నీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పుష్ప ది రూల్ కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus