Fahadh Faasil: మరోసారి వెర్సటైల్‌ యాక్టర్‌ను తీసుకొస్తున్న లోకేశ్‌.. ఈసారి ఎలా?

కమల్‌ హాసన్‌ ‘విక్రమ్‌’ సినిమాలో ఫహాద్‌ ఫాజిల్‌ను చూసి చాలామంది మురిసిపోయారు. ఎందుకంటే నేచురల్‌ యాక్టింగ్‌కి కాస్త పెప్‌ జోడించి భలేగా నటిస్తారాయన. ఆ తర్వాత ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాలో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా అదరగొట్టారు. రీసెంట్‌గా హీరోగా ‘ఆవేశం’ చూపించి విజయం అందుకున్న ఫహాద్‌ మరో వైవిధ్యమైన పాత్రకు సిద్ధమవుతున్నారు అని సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రజనీ కొత్త సినిమాలో ఫహాద్‌ నటిస్తారట. విజయ్‌తో ‘లియో’ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ‘కూలీ’ అనే సినిమా అనౌన్స్‌ చేశారు.

ఇటీవల టీజర్‌తో భలేగా అనౌన్స్‌ చేశారు కూడడా. రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలోనే ఫహాద్‌ ఫాజిల్‌ నటిస్తారు అంటున్నారు. శ్రుతి హాసన్‌ కీలక పాత్రలో నటిస్తోందని ఇప్పటికే చెప్పేయగా.. ఇప్పుడు ఫహాద్‌ ఫాజిల్‌ పేరు వినిపిస్తోంది. ‘విక్రమ్‌’ సినిమాలోని అతని నటను చూసి రజనీ సినిమాలోకి తీసుకున్నారని టాక్‌. ‘విక్రమ్‌’, ‘పుష్ప 1’ తరహాలోనే మరో శక్తిమంతమైన పాత్రను ఫహాద్‌ కోసం లోకేశ్‌ కనగరాజ్‌ సిద్ధం చేశారని టాక్‌.

ఇప్పటికే ఈ పాత్ర విషయమై ఫహాద్‌తో సంప్రదింపులు పూర్తయినట్లు సమాచారం. జులై ప్రథమార్ధంలో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్‌ చేయడానికి ప్లాన్స్‌ వేస్తున్నారట. ఈ లోపు కాస్టింగ్‌ ఎంపికను కంప్లీట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫహాద్ పేరు వినిపించింది. మరి కమల్‌తో కలసి మెప్పించిన ఫహాద్‌ రజనీతో ఎలా నటిస్తారో చూడాలి. ఇక ‘కూలీ’ సినిమా సంగతి చూస్తే.. రజనీకాంత్‌ ఇందులో గోల్డ్‌ స్మగ్లర్‌గా కనిపిస్తారు.

రెగ్యులర్‌ లోకేశ్ కనగరాజ్‌ సినిమాలకు ఇది దూరంగా ఉంది అని అనిపిస్తోంది. డ్రగ్స్‌ నేపథ్యంలో ఇన్నాళ్లూ సినిమాలు చేస్తూ వచ్చిన లోకేశ్‌ కనగరాజ్‌ ఈసారి ట్రాక్‌ మార్చారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’ కిందకు వస్తుందా లేదా అనేది తెలియడం లేదు. సినిమా మొదలై, కొద్ది రోజులు అయితే కానీ ఈ విషయంలో స్పష్టత రాదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus