Faima,Revanth: సిసింద్రీ టాస్క్ లో ట్విస్ట్ ఇచ్చిన ఫైమా..! రేవంత్ కి కోపం ఎందుకొచ్చిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు పెడితేనే హౌస్ మేట్స్ అసలు రంగు బయటపడుతుంది. ఎవరు జెన్యూన్ గా ఆడుతున్నారు ? ఎవరు ఫేవరెటిజం చూపిస్తున్నారు అనేది అర్ధమవుతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం కెప్టెన్సీ పోటీదారుల కోసం సిసింద్రీ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. హౌస్ మేట్స్ అందరికీ ఒక బేబీ డాల్ ని పంపించి దానిని జాగ్రత్తగా చూస్కుంటూ ఛాలెంజస్ లో పోటీపడాలి. అలా ఛాలెంజస్ లో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అవుతారు. మొదటి ఛాలెంజలో సాక్స్ అండ్ స్టిక్ పోటీ మొదలైంది.

ఇందులో పాల్గొన్న రేవంత్ అన్ని షేప్స్ ని తనకి కేటాయించిన బాక్స్ లో స్టిక్ చేశాడు. కానీ, ఒకటి మాత్రం ఫైమా దగ్గర రాంగ్ గా అంటించి ఉండిపోయింది. దానిని తీయమని ఫైమాని బ్రతిమిలాడాడు. కానీ, ఫైమా తన గేమ్ ఆడుకుంటూ పట్టించుకోలేదు. దీంతో చంటి మిగతా వాటిని స్టిక్ చేసి ఛాలెంజ్ లో గెలిచాడు. తిక్కరేగిన రేవంత్ మాటలు విసిరాడు. ఫైమా కావాలనే చంటికోసం ఆడావా అంటూ మాట్లాడాడు. వేరేవాళ్ల కోసం కాకుండా నీకోసం గేమ్ ఆడమని చెప్పాడు. సంచాలక్ గా ఉన్న నేహాని కూడా చెప్పాలి కదా అంటూ ఫైర్ అయ్యాడు.

దీంతో రేవంత్ ఛాలెంజ్ లో ఓడిపోయాడు. ఆ బాధతో చాలాసేపే అక్కడక్కడే ఉండిపోయాడు. ఈలోగా రేవంత్ బేబీని తీస్కున్న గీతు లాస్ట్ అండ్ ఫైండ్ బాక్స్ లో వేసేసింది. ఇక రేవంత్ పూర్తిగా కెప్టెన్సీ పోటీదారుల పోటీ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. మరో చాలెంజ్ లేకుండా అయిపోయింది. బిగ్ బాస్ రేవంత్ బేబీని స్టోర్ రూమ్ లో పెట్టమని చెప్పాడు. కొద్దిగా ఎమోషనల్ అయిన రేవంత్ మెరీనా అండ్ రోహిత్ ల దగ్గరకి వచ్చి ఏడ్చాడు.

త్వరలో మూడునెలల్లో బేబీ పుట్టబోతోందని, ఈ బేబీడాల్ ని పక్కలో వేసుకుని ఈరోజు పడుకుని ఆ ఫీలింగ్ అనుభవిద్దాం అనుకున్నాను అని, కానీ ఇలా అయిపోయిందని బాధపడ్డాడు. ఆ తర్వాత తన బేబీడాల్ ని తీసి సేవ్ చేద్దామని అనకున్న కీర్తిని పిలిచి హగ్ చేసుకున్నాడు. అలాగే, ఫైమాని పిలిచి హగ్ చేసుకుని కూల్ అయ్యాడు రేవంత్. ప్రస్తుతం కెప్టెన్సీ పోటీదారుల రేస్ నుంచీ రేవంత్ తప్పుకున్నాడు. అదీ మేటర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus