Pushpa2: పుష్ప2 విషయంలో ఫేక్ వార్తల ప్రచారం వెనుక స్ట్రాటజీ ఇదేనా?

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2 మూవీ మరో రిలీజ్ కు మరో 7 నెలల సమయం ఉంది. ఈ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. పుష్ప ది రైజ్ మూవీ ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. పుష్ప ది రైజ్ సినిమాకు అంచనాలకు మించి కలెక్షన్లు వచ్చాయి. పుష్ప ది రూల్ సినిమాకు ఇప్పటికే ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే పుష్ప2 సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా రిలీజ్ కానుండగా అదే సమయానికి పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లు అదే సమయానికి రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ రీజన్ వల్ల పుష్ప ది రూల్ సినిమాకు బిజినెస్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు బాలీవుడ్ మీడియా నెగిటివ్ కథనాలను ప్రచారంలోకి తెస్తోంది. పుష్ప ది రూల్ విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తూ బాలీవుడ్ మీడియా ఈ సినిమాపై అంచనాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

కొన్ని వారాల క్రితం డంకీ, సలార్ సినిమాలు ఒకే సమయంలో రిలీజ్ కాగా సలార్ సినిమా విషయంలో బాలీవుడ్ మీడియా ఒకింత కఠినంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. సలార్ మూవీ కలెక్షన్లు తగ్గడానికి బాలీవుడ్ మీడియా కూడా కొంతమేర కారణమని చాలామంది భావిస్తారు. బాలీవుడ్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే తెలుగు ప్రేక్షకులు సైతం ఆ సినిమాలను ఆదర్శిస్తున్నారు.

పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే మూవీ అవుతుందని కామెంట్లు వినిపిస్తుండగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో చూడాల్సి ఉంది. పుష్ప ది రూల్ ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బన్నీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను ఏ రేంజ్ లో ప్లాన్ చేశారో చూడాల్సి ఉంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus