అనవసరంగా ఆ రూమర్ వేశారా..?

తెలుగులో ఉన్న యాంకర్స్ లో స్టార్ యాంకర్ అంటే మనకి టక్కున గుర్తొచ్చే పేరు సుమ. 30 కి 30 రోజులూ బిజీగా ఉండే యాంకర్ సుమ… బుల్లితెర పై తన మార్క్ యాంకరింగ్ తో ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ను క్రియేట్ చేసుకుంది. గతంలో సుమ పలు సినిమాల్లో కూడా నటించింది. ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ ‘చాలా బాగుంది’ ‘వర్షం’ ‘బాద్ షా’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఎందుకో సినిమాల్లో మాత్రం కంటిన్యూ కాలేకపోయింది. దానికి కారణం ఈమె కాల్షీట్లు ఖాళీ లేకపోవడమే ప్రధాన కారణమని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే.. సుమ ఇప్పుడు ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది అంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ సుమ ఏ స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది అనేగా మీ డౌట్? ఇంకెవరు.. మన అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ .. సుకుమార్ డైరెక్షన్లో ‘పుష్ప’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో సుమ .. బన్నీకి అక్కగా నటిస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. సుమ స్టార్ యాంకర్ కాబట్టి ఈ వార్త వెంటనే వైరల్ అయిపొయింది.

కానీ ఈ ప్రచారంలో ఎటువంటి నిజం లేదని.. దర్శకుడు సుకుమార్ సన్నిహిత వర్గాల నుండీ సమాచారం. ఇక సుమ కూడా ఇది తప్పుడు ప్రచారం అని తేల్చేసిందని టాక్. లాక్ డౌన్ కారణంగా సుమకు షూటింగ్ లు లేకపోయి ఉండొచ్చు కానీ.. ఒక్కసారి లాక్ డౌన్ ముగిసాక.. ఆమె వరుసగా షూటింగ్ లతో బిజీగా ఉంటుందట. కాబట్టి అల్లు అర్జున్ ‘పుష్ప’ లో ఈమె నటించే అవకాశం లేదని స్పష్టమవుతుంది.

Most Recommended Video

అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
రానా కు కాబోయే భార్య గురించి ఎవరికీ తెలియని విషయాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus