Pawan Kalyan: ఆ అసత్య ప్రచారం పవన్ ను కూడా ఇబ్బంది పడుతుందట..!

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీర మల్లు అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు రానాతో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కంటెంట్ బేస్డ్ మూవీస్ అనే చెప్పాలి.కాబట్టి.. వీటి పై పవన్ ఫ్యాన్స్ కు అంత ఆసక్తి లేనట్టుగా అనిపిస్తుంది. ప్రస్తుతం వాళ్ళ దృష్టి అంతా హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ చేయబోయే మూవీ పైనే ఉంది.పవన్ కు గబ్బర్ సింగ్ లాంటి కం బ్యాక్ మూవీ ఇచ్చాడు కాబట్టి..

ఈసారి కూడా అలాంటి ఆల్ టైం హిట్ మూవీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా టైటిల్, ఫస్ట్ లుక్ నటీనటుల వివరాలు రివీల్ చేయకుండానే నచ్చిన టైటిల్ మరియు నటీనటులను ఫిక్స్ చేసుకుంటున్నారు. పవన్ – హరీష్ ల మూవీలో మలయాళ హీరోయిన్ మానస రాధాకృష్ణన్ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తేల్చి పడేసింది.

అలాగే ఈ చిత్రానికి ‘స్టేట్‌కి ఒక్క‌డే’ అనే మాస్ టైటిల్ పెడుతున్నట్టు కూడా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తల్లో కూడా నిజం లేదని హరీష్ శంకర్ తేల్చి పడేశాడు. నిజానికి ఇప్పుడున్న కరోనా సెకండ్ వేవ్ టెన్షన్ లో ఎటువంటి అప్డేట్ లు వంటివి ఇవ్వకూడదు అని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. కానీ ఇలాంటి అసత్య ప్రచారం పవన్ ను కూడా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus