మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తుంటారు. తొలి సారి నందమూరి హీరోని తన స్టైల్లో చూపించబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీలో కొత్తగా కనిపించడానికి ఎన్టీఆర్ బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ ఆధ్వర్యంలో బరువు తగ్గుతున్నారు. ఇప్పటికే తారక్ పదికిలోలు తగ్గినట్లు సమాచారం. షూటింగ్ సమయానికి మరో ఐదుకిలోలు తగ్గాలని కష్టపడుతున్నారు. అయితే ఈ సినిమా గురించి కొన్ని వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. అందులో ప్రధానంగా సంగీత దర్శకుడు అనిరుధ్ పై గాసిప్స్ వెలువడుతున్నాయి.
తమిళ సంగీత దర్శకుడైన ఇతను తొలిసారిగా త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాకి సంగీతాన్ని అందించారు. సినిమా రిలీజ్ కి ముందు అనిరుధ్ మంచి సంగీతాన్ని అందించారు అని చెప్పిన వారు అంతా.. అజ్ఞాతవాసి మూవీ రిలీజ్ అయిన తర్వాత నేపథ్య సంగీతం బాగాలేదని విమర్శించారు. దేవీ శ్రీ ప్రసాద్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అప్పటివరకు త్రివిక్రమ్, తారక్ సినిమాకి అనిరుధ్ అని ఫిక్స్ అయిన చిత్ర బృందం సడన్ గా అతన్ని మార్చినట్లు పుకారు షికారు చేసింది. అనిరుధ్ స్థానంలో దేవీ శ్రీ ప్రసాద్ ని తీసుకుంటున్నట్లు చెప్పుకుంటుంన్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో రెండు రోజులుగా హల్ చల్ చేస్తోంది. దీనిపై చిత్ర బృందం నేడు స్పందించింది. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఎన్టీఆర్ 28 వ సినిమాకి ఇంకా మ్యూజిక్ డైరక్టర్ ని ఖరారు చేయలేదని, ఈ సినిమాకి సంబంధిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది.