విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటిస్తున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) . పరశురామ్ పెట్ల(బుజ్జి) (Parasuram) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఉగాది కానుకగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. దానికి సూపర్ రెస్పాన్స్ లభించింది. ‘ఐరనే వంచాలా ఏంటి?’ అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయ్యింది.
ఇక ఇటీవల టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. అది కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ని, మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసింది. సో ‘ఫ్యామిలీ స్టార్’ పై అంచనాలు పెరిగాయి. అయితే రిలీజ్ మరో 3 వారాల్లో ఉన్నప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ప్రమోషన్స్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అది పక్కన పెట్టేస్తే.. ఈ సినిమాకి బడ్జెట్ కూడా పెరిగిపోయింది అని ఇన్సైడ్. అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఫ్యామిలీ స్టార్’ బడ్జెట్ రూ.90 కోట్లు దాటేసిందట.
ఇంకా ఓటీటీ బిజినెస్ జరగలేదు. విజయ్ దేవరకొండ గత సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి. సో ఇవన్నీ ఇప్పుడు నిర్మాత దిల్ రాజుని టెన్షన్ పెడుతున్నట్టు ఇన్సైడ్ టాక్. అసలే ‘గేమ్ ఛేంజర్’ సినిమా బడ్జెట్ పెరిగిపోయి దిల్ రాజు చాలా ఒత్తిడిలో ఉన్నారు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ బిజినెస్ విషయంలో కూడా ఆయన టెన్షన్ పడుతున్నట్లు వినికిడి.
రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!