చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు కలవరానికి గురి చేస్తున్నాయి.. ఇటీవల కామెర్లతో తమిళ యువ సంగీత దర్శకుడు, ప్రముఖ నటి సోనాలి చక్రవర్తి, సీరియల్ నటుడు భరత్ కళ్యాణ్ భార్య ప్రియదర్శిని తదితరులు మరణించారు. ఈ వార్తల గురించి మర్చిపోకముందే మరో ప్రముఖ నటుడు, థియేటర్ డైరెక్టర్ కన్నుమూశారనే దుర్వార్త షాక్‌కి గురిచేసింది. ఉపిందర్ ఖాషు.. యాక్టర్‌గా, థియేటర్ డైరెక్టర్‌గా, బ్రాడ్ కాస్టర్‌గా పేరు ప్రఖ్యాతులతో పాటు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు.
ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 1) తుదిశ్వాస విడిచారు. ఉపిందర్ వయసు 70 సంవత్సరాలు. ఆయనకు భార్య గిరిజా ఖాషు వాటల్,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గిరిజా ఆల్ ఇండియా రేడియో బ్రాడ్ కాస్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. శ్రీనగర్‌లో పుట్టిపెరిగిన ఉపిందర్ ఖాషు.. 1990ల కాలంలో తీవ్రవాదుల బెదిరింపుల కారణంగా అక్కడినుండి ఢిల్లీకి వలస వెళ్లవలసి వచ్చింది. ఢిల్లీకి వలస వెళ్ళకముందు కాశ్మీర్‌లో ఉర్దూ, కాశ్మీరీ వార్తలు చదివేవారాయన.
1980ల మధ్యలో టెలి సీరియల్ ‘చౌరహా’ (క్రాస్ రోడ్) లో కీలకపాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సీరియల్‌లో పోషించిన ఖాషు క్యారెక్టరే తర్వాత ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అనంతరం 1987లో దూరదర్శన్‌లో ప్రసారమైన పాపులర్ సీరియల్ ‘గుల్ గుల్షన్ గుల్ఫామ్’ ద్వారా ఉపిందర్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఉపిందర్ ఖాషు.. ముంబై, ఢిల్లీ, జమ్మూలాంటి ప్రదేశాలలో కాశ్మీరీ నాటకాలను రాయడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.
అలా థియేటర్ డైరెక్టర్‌గా మారిన ఉపిందర్ ఖాషు.. రంగస్థలం, రేడియో, టీవీ సీరియల్స్‌తో పాటు సినిమాలలో కూడా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. నటన పరంగా ఉపిందర్ వందలాది నాటకాలు, సీరియల్స్, కొన్ని సినిమాలలో నటించారు. అలాగే ఉపిందర్ తెరకెక్కించిన చివరి చిత్రం ‘వాసా’ (Wasa) ని రెండేళ్ల క్రితం జమ్మూలో ప్రదర్శించినట్లు చెప్తున్నారు. బ్రాడ్ కాస్టర్‌గా, థియేటర్ డైరెక్టర్‌గా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపిందర్ ఖాషు మృతిపట్ల సినీ వర్గాలవారు, ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!