Prabhas: హీరో ప్రభాస్ కు శుక్ర మహాదశ.. కానీ?

మనలో చాలామంది జాతకాలను నమ్మడాన్ని అస్సలు ఇష్టపడరు. అయితే సెలబ్రిటీలలలో మాత్రం చాలామంది జాతకాలను నమ్ముతారు. ఈ మధ్య కాలంలో కొంతమంది జ్యోతిష్కులు హీరోహీరోయిన్ల జాతకాలను చూసి వాళ్ల జీవితంలో ఏం జరగబోతుందో ముందే చెప్పేస్తున్నారు. ఒక సిద్ధాంతి రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ప్రభాస్ కెరీర్ అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాస్ కెరీర్ లో శుక్ర మహాదశ నడుస్తోందని ప్రభాస్ కెరీర్ సూపర్ గా ఉందని సమాచారం.

ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 70 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో ప్రభాస్ మాత్రమే పారితోషికం తీసుకుంటున్నారు. ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల ద్వారా ఏకంగా 500 కోట్ల రూపాయల పారితోషికం దక్కుతోందని తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోలకు ప్రభాస్ గట్టి పోటీ ఇస్తుండగా ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు సక్సెస్ సాధిస్తే ప్రభాస్ బాలీవుడ్ లో అక్కడి స్టార్ హీరోలను మించి క్రేజ్ ను సొంతం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ గా కూడా ఎదుగుతారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానుండగా ప్రాజెక్ట్ కె, స్పిరిట్ సినిమాలు 2023లో రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ 5 సినిమాల బడ్జెట్ 1500 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus