Abhishek Bachchan: ‘ది బిగ్ బుల్’ కూడా వర్కవుట్ కాలేదే..!

అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ కు అసలు ఏదీ కలిసిరావడం లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ స్టార్ హీరో రేంజ్ అందుకోలేకపోతున్నాడు. ఈ మధ్యకాలంలో అతడి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇలాంటి సమయంలో ఓ సరికొత్త కథతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనుకున్నాడు. షేర్ మార్కెట్ లో భారీ స్కామ్ చేసి 90వ దశకంలో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథతో తెరకెక్కిన ‘ది బిగ్ బుల్’ అనే సినిమాలో నటించాడు అభిషేక్ బచ్చన్.

ఈ సినిమా తన కెరీర్ యూ మలుపు తిప్పుతుందని ఆశించాడు. ఈ సినిమా కోసం జూనియర్ బచ్చన్ చాలానే కష్టపడ్డాడు. కానీ ఇదే కథతో ‘స్కామ్ 1992’ అనే వెబ్ సిరీస్ కొద్దిరోజుల క్రితం ఓటీటీలో విడుదలై మంచి టాక్ ను సంపాదించుకుంది. ఈ సిరీస్ ఇంత భారీ సక్సెస్ అవుతుందని అభిషేక్ బచ్చన్, బిగ్ బుల్ టీమ్ ఊహించలేదు. దీంతో తమ సినిమా రిలీజ్ ను వాయిదా వేస్తూ వచ్చాయి. ఫైనల్ గా ఈ నెల 8న హాట్ స్టార్ లో సినిమాను రిలీజ్ చేశారు.

‘స్కామ్ 1992’తో పోల్చి చూస్తే ‘ది బిగ్ బుల్’ అంత గొప్పగా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. అభిషేక్ బచ్చన్ నటన పరంగా ఆకట్టుకున్నప్పటికీ.. సినిమా ఏమంత ఆసక్తికరంగా లేదని పెదవి విరుస్తున్నారు. ఈ సినిమా వలన అభిషేక్ కి కలిసొచ్చేది ఏం లేదని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీలో విడుదలైనప్పటికీ.. అభిషేక్ కెరీర్ లో ఇదొక ప్లాప్ సినిమాగానే చూస్తున్నారు.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus