Guntur Kaaram: మహేష్ ఈ మూవీతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిందే.. ఎందుకంటే?

  • November 6, 2023 / 04:16 PM IST

మరికొన్ని గంటల్లో గుంటూరు కారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. గుంటూరు కారం సినిమా ప్రమోషన్స్ మొదలుకావడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ గుంటూరు కారం కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలని కామెంట్లు చేస్తున్నారు. గుంటూరు కారం తర్వాత మహేష్ జక్కన్న సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. జక్కన్న డైరెక్షన్ లో సినిమా కనీసం మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.

వరుసగా ఇండస్ట్రీ హిట్ల తర్వాత రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో గుంటూరు కారం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టైతే మరో మూడేళ్ల పాటు తమ ఎదురుచూపులకు కూడా అర్థం ఉంటుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఈ మూవీతో (Guntur Kaaram) కచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధించాల్సిందేనని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. మహేష్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

రాజమౌళి సినిమాను పూర్తి చేసిన తర్వాతే మహేష్ బాబు కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ బాబు పారితోషికం 110 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. మహేష్ రాజమౌళి కాంబో మూవీలో నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. మహేష్ కు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

2024 సంవత్సరంలో మహేష్ బాబు రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మహేష్ బాబు సైతం జక్కన్న డైరెక్షన్ లో నటించడానికి చాలా ఆసక్తి ఉందని చెప్పుకొచ్చారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి వచ్చే అప్ డేట్స్ ప్రేక్షకులకు కిక్కిచ్చేలా ఉండనున్నాయని సమాచారం. మహేష్ జక్కన్న కాంబో మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus