Salaar: సలార్ లో గోపీచంద్ నటించి ఉంటే బాగుండేదంటున్న ఫ్యాన్స్.. ఏమైందంటే?

సలార్ మూవీ నుంచి తాజాగా రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చెప్పిన సమయం కంటే ఆలస్యంగా విడుదలైనా ఈ ట్రైలర్ లో ఫ్యాన్స్ కోరుకున్న అంశాలు పుష్కలంగా ఉన్నాయి. సలార్ మూవీ కథ గురించి, సలార్ మూవీ ట్విస్టుల గురించి ప్రేక్షకులకు ఒకింత క్లారిటీ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ లో శృతికి ప్రాధాన్యత దక్కడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. సలార్ రిలీజ్ ట్రైలర్ గురించి ఫ్యాన్స్ పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.

ప్యూర్ గూస్ బంప్స్ అంటూ ఫ్యాన్స్ సలార్ గురించి చేస్తున్న కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే సలార్ సినిమాలో వరద రాజమన్నార్ పాత్రలో గోపీచంద్ నటించి ఉంటే బాగుండేదంటూ కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ విధంగా కామెంట్ చేయడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. వర్షం సినిమాలో ప్రభాస్ గోపీచంద్ కలిసి నటించగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

గోపీచంద్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను సైతం అద్భుతంగా పోషించగలరనే సంగతి తెలిసిందే. అందువల్ల వరద రాజమన్నార్ పాత్రలో గోపీచంద్ నటించి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. సలార్ లో కుదరకపోయినా భవిష్యత్తులో ఈ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు భావిస్తున్నారు. (Salaar) సలార్2 కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుందని తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ సలార్2 సినిమాను పూర్తి చేసి ఎన్టీఆర్ సినిమాతో బిజీ కానున్నారని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. సలార్ లో ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉండేలా ప్రశాంత్ నీల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారితే ఎలా ఉంటుందనే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సలార్ రిలీజ్ ట్రైలర్ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ కంటెంట్ తో తెరకెక్కిందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కేవలం 4 గంటల్లో ఈ ట్రైలర్ కు 6.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus