Star Heroes: చిరు, పవన్ కళ్యాణ్, నాగ్ అభిమానులకు పండగే.. కానీ?

మరో రెండు రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా జరగనున్నాయి. చిరంజీవి పుట్టినరోజు కానుకగా చిరంజీవి కొత్త సినిమాలకు సంబంధించి ప్రకటనలు వస్తాయో రావో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ ల డైరెక్టర్ల జాబితాలో చాలామంది దర్శకులు ఉన్నారు. అయితే చిరంజీవి మొదట ఎవరికి అవకాశం ఇస్తారో అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి భవిష్యత్తు ప్రాజెక్ట్ లలో ఒక సినిమా రీమేక్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారానికి సంబంధించి స్పష్టత రావాల్సి ఉంది.

చిరంజీవి ఏజ్ పెరుగుతున్నా యంగ్, ఎనర్జిటిక్ గా కనిపిస్తూ తన అద్భుతమైన నటనతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. చిరంజీవి పారితోషికం 60 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం. ఆగష్టు నెల 29వ తేదీన నాగ్ పుట్టినరోజు కాగా ఆరోజు నాగ్ కొత్త సినిమాల అప్ డేట్స్ తో పాటు బిగ్ బాస్ షో సీజన్7 కు సంబంధించిన అప్ డేట్స్ వస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

నాగ్ (Star Heroes) స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో, యంగ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించాలని అభిమానులు ఫీలవుతుండగా ఉండగా నాగ్ కెరీర్ ప్లాన్ ఏ విధంగా ఉండనుందో చూడాల్సి ఉంది. నాగ్ పారితోషికం కూడా భారీ రేంజ్ లో ఉండనుంది. సెప్టెంబర్ నెల 2వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కాగా పవన్ సినిమాలకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ అయితే రానున్నాయి.

పవన్ సినిమాల టీజర్లు, గ్లింప్స్ రానుండటంతో పవన్ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలో కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు అయితే చేయబోరని 2024 ఎన్నికల ఫలితాల తర్వాతే పవన్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రానుందని తెలుస్తోంది.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus