Allu Arjun Fans: బన్నీ అభిమానులకు గాయాలు.. ఏమైందంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో నటించిన పుష్ప పార్ట్1 ఈ నెల 17వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ మాదాపూర్‌ ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో అభిమానులతో ఫోటో సెషన్ ను ప్లాన్ చేశారు. బన్నీతో ఫోటో సెషన్ కోసం ఊహించని స్థాయిలో అభిమానులు కన్వెన్షన్‌ సెంటర్‌ దగ్గరకు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ తర్వాత బన్నీ రావడం లేదని ఫ్యాన్స్ మీట్ ను రద్దు చేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు.

బన్నీ ఫ్యాన్స్ మీట్ కు హాజరు కావడం లేదని తెలియడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఎన్ కన్వెన్షన్ అద్దాలతో పాటు గేటును కూడా ధ్వంసం చేయడానికి అభిమానులు ప్రయత్నించారు. విషయం తెలిసిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొనిరావాలనే ఉద్దేశంతో బన్నీ ఫ్యాన్స్ పై లాఠీఛార్జ్ చేశారు. లాఠీఛార్జ్ ద్వారా పోలీసులు అభిమానులను చెదరగొట్టగా పలువురు బన్నీ ఫ్యాన్స్ కు గాయాలయ్యాయి.

అయితే నిర్వాహకులు ఫోటో సెషన్ కోసం పాసులు జారీ చేశారని పాసులు ఉన్నప్పటికీ ప్రోగ్రామ్ ను ఏ విధంగా క్యాన్సిల్ చేశారని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఫోటో సెషన్ క్యాన్సిల్ చేయడం సరి కాదని బన్నీ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా జరిగిన పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కేవలం 5,000 మంది అభిమానులకు మాత్రమే అనుమతి ఉండగా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎక్కువ పాసులు జారీ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని ప్రచారం జరిగింది.

పుష్ప రిలీజ్ కు మూడురోజుల ముందు చోటు చేసుకుంటున్న ఘటనలు బన్నీ ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి. 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పుష్ప సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయి థియేటర్లలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. సుకుమార్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus