ప్రభాస్ డెసిషన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చినట్టే..!

‘రాధే శ్యామ్’ చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ప్రభాస్ ప్రస్తుతం బిజీగా గడుపుతున్నాడు. ‘జిల్’ ఫేమ్ రాధా కృష్ణకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 40శాతం పూర్తయ్యింది. మొన్ననే ఇటలీ షెడ్యూల్ ను ఫినిష్ చేసుకుని ఇండియాకి తిరిగొచ్చారు ‘రాధే శ్యామ్’ టీం. ఈ చిత్రం పూర్తయ్యాక ప్రభాస్ ‘ఆది పురుష్’ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం తెలుగు,హిందీ, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో రూపొందనుంది.

ఈ చిత్రం చేస్తూనే మరోపక్క నాగ్ అశ్విన్ డైరెక్షన్లో సైన్స్ ఫిక్షన్ మూవీ చెయ్యడానికి కూడా ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా.. ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. ‘యూవీ క్రియేషన్స్’ వారు ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి. ఈ కాంబో సెట్ అవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కోరుకున్నారు. కానీ ప్రభాస్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో సినిమా చేసే ఆలోచనలో లేడని తాజా సమాచారం.

‘ఈ రెండేళ్ళల్లో ఎట్టిపరిస్థితుల్లోనూ ‘ఆదిపురుష్’ నాగ్ అశ్విన్.. ప్రాజెక్టులను ఫినిష్ చెయ్యాలని.. దాని తరువాతే ఏదైనా అని’ ప్రభాస్ తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలతో చెబుతున్నాడట. దాంతో ‘కె.జి.ఎఫ్’ దర్శకుడితో ప్రభాస్ సినిమా లేనట్టేనని స్పష్టమవుతుంది.ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు ఓ రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus