జోష్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన నాగచైతన్య కెరీర్ లో కలెక్షన్లపరంగా మజిలీ సినిమా బిగ్గెస్ట్ హిట్ అనే సంగతి తెలిసిందే. శివ నిర్వాణ డైరెక్షన్ లో చైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా చైతన్యకు నటుడిగా మంచిపేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత చైతన్య నటించిన సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు చైతన్య మార్కెట్ ను పెంచుతున్నాయి. గతేడాది విడుదలైన లవ్ స్టోరీ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలను అందించింది.
ఒక విధంగా మజిలీ సినిమా చైతన్య జాతకాన్ని మార్చిందని చైతన్య అభిమానులు భావిస్తున్నారు. కథల ఎంపికలో చైతన్య మారాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఊరమాస్ కథలకు దూరంగా ఉంటున్న చైతన్య ప్రేక్షకులకు నచ్చే, తనకు నప్పే పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. బంగార్రాజు సినిమాతో చైతన్య ఖాతాలో మరో సక్సెస్ చేరింది. ఈ సినిమాకు మిక్స్ డ్ రివ్యూలు వస్తున్నా సంక్రాంతి పండుగకు సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు బంగార్రాజు ఫస్ట్ ఛాయిస్ కానుంది.
సంక్రాంతికి రిలీజైన సినిమాలలో ఇతర సినిమాలతో పోలిస్తే బంగార్రాజు సినిమాకే మంచి టాక్ రావడం గమనార్హం. ఒకప్పుడు వీక్ స్టోరీస్ ను ఎంపిక చేసుకుని వరుసగా పరాజయాలను చవిచూసిన చైతన్య ప్రస్తుతం సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటున్నారు. నాగచైతన్య తరువాత సినిమా థాంక్యూ కాగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చైతన్య హర్రర్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. పరశురామ్ డైరెక్షన్ లో చైతన్య హీరోగా ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది.
టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తూ నాగచైతన్య మిడిల్ రేంజ్ హీరోలలో తన రేంజ్ ను మరింత పెంచుకున్నారు. నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు పది కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. థాంక్యూ సినిమా సక్సెస్ సాధిస్తే చైతన్య పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కథ నచ్చితే మల్టీస్టారర్ సినిమాలకు సైతం చైతన్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!