సంక్రాంతి సినిమాలపై స్టార్ హీరోల భారీ ఆశలు.. నిజమవుతాయా?

  • December 30, 2023 / 01:26 PM IST

సంక్రాంతి పండుగ కానుకగా ఏకంగా 5 సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. నా సామిరంగ మూవీ రిలీజ్ డేట్ విషయంలో మార్పు ఉంటుందని ప్రచారం జరుగుతున్నా మేకర్స్ నుంచి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమా కూడా రేసులోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అయితే సంక్రాంతి కానుకగా విడుదలయ్యే సినిమాలలో ఏ సినిమాకు మరీ భారీ స్థాయిలో థియేటర్లు దక్కే ఛాన్స్ లేదు. నెగిటివ్ టాక్ వస్తే సినిమాకు మాత్రం భారీ స్థాయిలో నష్టాలు తప్పవు.

ప్రేక్షకుల ముందు ఎక్కువ సంఖ్యలో ఆప్షన్లు ఉంటాయి కాబట్టి సినీ అభిమానులు సైతం నెగిటివ్ టాక్ వచ్చే సినిమాను చూడటానికి ఆసక్తి చూపించే అవకాశాలు అయితే తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. సంక్రాంతి కానుకగా విడుదలై నెగిటివ్ టాక్ వచ్చిన సినిమాలకు భారీ స్థాయిలో నష్టాలు తప్పవని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సంక్రాంతి సినిమాలు ఏ రేంజ్ లో కలెక్షన్లు సాధిస్తాయో చూడాల్సి ఉంది.

సంక్రాంతి సినిమాలలో కొన్ని సినిమాలకు ఓటీటీ, డిజిటల్ డీల్స్ ఇంకా పూర్తి కాలేదని సమాచారం అందుతోంది. 2016 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజ్ కావడంతో కొన్ని సినిమాలు కలెక్షన్ల విషయంలో తీవ్రస్థాయిలో నష్టపోయాయి. ఈసారి అదే పరిస్థితి రిపీట్ కాకూడదని అభిమానులు ఫీలవుతున్నారు. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ, ఈగల్ సినిమాలు వేటికవే ప్రత్యేకం కాగా ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఈ సినిమాలను నిర్మించాయి.

సంక్రాంతి సినిమాలన్నీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని 2024 సంవత్సరానికి శుభారంభాన్ని ఇస్తాయేమో చూడాల్సి ఉంది. సంక్రాంతి సినిమాలలో కొన్ని సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతుండగా ఆ సినిమాలు ఇతర భాషల్లో సత్తా చాటుతాయేమో చూడాల్సి ఉంది.

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus