Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Featured Stories » అభిమానులు అమ్మలాంటి వారు, వారి ప్రేమ అజరామరం – ప్రభాస్

అభిమానులు అమ్మలాంటి వారు, వారి ప్రేమ అజరామరం – ప్రభాస్

  • January 3, 2018 / 09:38 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అభిమానులు అమ్మలాంటి వారు, వారి ప్రేమ అజరామరం – ప్రభాస్

ఒక సగటు తెలుగు సినిమాగా విడుదలైన ‘బాహుబలి’ అనంతరం సృష్టించిన రికార్డులు, చేసిన హంగామా మరువడం సులభతరం కాదు. ఆ సినిమాతో ప్రభాస్ అంతర్జాతీయ నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు. అంతటి భారీ సక్సెస్ అనంతరం కూడా ప్రభాస్ కి కించిత్ గర్వం పెరగలేదు సరికదా ఇంకాస్త వొద్దికగా మెలిగాడు. అందుకే ప్రభాస్ జాతి, కుల, మత బేధాలు లేకుండా అందరికీ ఇష్టుడయ్యాడు. ప్రస్తుతం “సాహో” సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఓ ఆంగ్ల మాస పత్రికకు ఇచ్చిన ప్రత్యేకమైన ఇంటర్వ్యూను ప్రభాస్ అభిమానుల కోసం తెలుగులో తర్జమా చేయడం జరిగింది.

ఆ విజయం నా గమ్యాన్ని మార్చింది..
“బాహుబలి” సక్సెస్ అవుతుందని ముందే ఊహించగలిగాం కానీ.. ఈస్థాయి చరిత్ర సృష్టిస్తుంది అని మాత్రం అనుకోలేదు. ఈ సక్సెస్ తర్వాత నా కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఆలోచనలో సగం రోజులు నిద్రపట్టలేదు. తర్వాత సినిమా ఎలా ఉండాలి, జనాలు నన్ను మళ్ళీ ఒక రెగ్యులర్ మాస్ హీరోగా చూడగలరా, మార్కెట్ పరిధి పెరిగింది కాబట్టి కథల ఎంపికలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, నా అభిమానులు గర్వపడకపోయినా పర్లేదు కానీ నిరాశపడకూడదు అనే ఆలోచనలతోనే సరిపోయేది. ఇప్పుడిప్పుడు ఆ మేనియాలో నుంచి బయటపడుతున్నాను.prabhas-01-min

భయంతో బిక్కుబిక్కుమంటూ చూశాను..
నా మొదటి సినిమా “ఈశ్వర్” రిలీజ్ రోజున మా అమ్మ, మా అక్కతో కలిసి చూశాను. ఇద్దరి మధ్యలో కూర్చుని వాళ్ళ చేతులు పట్టుకుని టెన్షన్ తో ఆ సినిమా చూడడం ఎప్పటికీ మరువలేను. ఇప్పటికీ నా ప్రతి సినిమా విషయంలో తెగ టెన్షన్ పడిపోతాను. కాకపోతే కమర్షియల్ సక్సెస్ ల గురించి పట్టించుకోవడం మానేశాను కాబట్టి.. సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటున్నారు అనే విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొంటున్నాను.prabhas-02-min

అభిమానులు అమ్మలాంటి వారు..
నాకు తెలిసినంతవరకూ అభిమానులు అమ్మలాంటివారు. వారు చూపించే ప్రేమకి పరిమితలుండవు. అందుకే అభిమానులంటే నాకు అమితమైన ప్రేమ. నా సినిమాలు చూసి వారు ఆనందపడాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే కథలు ఎంపిక చేసుకొంటాను.prabhas-03-min

అనుష్క నాకు మంచి స్నేహితురాలు మాత్రమే..
నేను అనుష్కతో కలిసి ఎక్కువ సినిమాలు చేయడం, “బాహుబలి” కోసం ఏకంగా అయిదేళ్లపాటు కలిసి ట్రావెల్ అవ్వడంతో మా ఇద్దరి మధ్య లేనిపోనివి తగిలించారు కానీ.. ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే. అసలు వేరే విషయాలను మేం పట్టించుకోం. ఎవరికీ ఎక్స్ ప్లేనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు.prabhas-04-min

సహనం అప్పుడు నేర్చుకొన్నాను..
“”బాహుబలి” కోసం అయిదేళ్లు వెచ్చించారు కదా మీకు అంత ఓపిక ఎలా వచ్చింది?” అని చాలా మంది అడిగారు. సినిమా అనేది నాకు ఫ్యాషన్ సో నాకు నచ్చిన పని కోసం అన్నేళ్లు వెయిట్ చేయడం పెద్ద విశేషం ఏమీ కాదు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో రోజూ కాలేజ్ కి బస్ లోనే వెళ్ళేవాడ్ని. మా నాన్నగారు ఒకసారి మొగల్తూరు తీసుకెళ్లి.. “ఒక నెలరోజులపాటు ఈ ఊర్లో సమస్యలన్నీ నువ్వే చూసుకోవాలి” అని ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. అసలేం చేయాలో తెలీదు. ఎవరితో మాట్లాడాలో తెలీదు. వాళ్ళు చెప్పిన సమస్యలను ఎలా తీర్చారో అసలు ఐడియా లేదు. అలాంటి పరిస్థితిని అధిగమించినప్పుడే “ఓపిక, సహనం”లాంటివి అలవాటయ్యాయి.prabhas-05-min

రాజమౌళి తెగ ఎగ్జయిట్ చేసేవాడు..
అసలు రాజమౌళీతో పని చేయేడమే ఒక అద్భుతం. ఆయన సన్నివేశాన్ని వివరించే విధానం, మా నుంచి సన్నివేశానికి తగ్గట్లు నటనను రాబట్టుకొనే తీరు, అందరితోనూ కలివిడిగా మెలిగే వ్యక్తిత్వం మమ్మల్ని ఆయన మాయలో నుంచి బయటకు రానీకుండా చేసేది. అసలు కొన్ని సీన్లు చెప్పేప్పుడు రాజమౌళి తాను ఎగ్జయిట్ అవ్వడంతోపాటు మమ్మల్ని కూడా విపరీతంగా ఎగ్జయిట్ చేసేవాడు. ఇప్పుడవన్నీ తలచుకొంటే ఫన్నీగా అనిపిస్తుంది. ఒక్కోరోజు షూటింగ్ అర్ధరాత్రి వరకూ జరిగేది, నెక్స్ట్ డే లేట్ గా వెళ్లొచ్చు కదా అన్న ఆలోచన వచ్చేది, లేట్ గా వచ్చినా అక్కడ అడిగేవాళ్లు కూడా లేరు. కానీ.. మనసులో ఎక్కడో తెలీని ఇబ్బంది. ఇంతమంది కష్టపడుతున్నప్పుడు మనం లేట్ గా వెళ్ళడం ఎంతవరకూ సబబు అనిపించేది. అందుకే షూటింగ్ మొత్తంలో ఎప్పుడో దెబ్బలు తగిలితే తప్ప ఒక్కరోజు కూడా లేట్ గా వెళ్ళడం కానీ.. షూటింగ్ కి డుమ్మా కొట్టడం లాంటివి చేయలేదు.prabhas-06-min

నేనెందుకు గర్వపడాలి..
“సినిమాలో నటించినందుకు గర్వంగా ఉందా?” అని ఈమధ్య మీడియా ఇంటర్వ్యూల్లో అడుగుతున్నారు. అసలు ఆ సినిమాలో నటించినందుకు నేనెందుకు గర్వపడాలి చెప్పండి. కథ నేను రాయలేదు, సినిమా నేను తీయలేదు. కేవలం నటించాను, అది కూడా దర్శకుడు ఎలా చేయాలో చెప్తే, అతను చెప్పినట్లు చేసుకుంటూపోయాను. సో, ఈ సినిమాని నేను బాధ్యతగా భావించాను తప్పితే.. ఎప్పూడూ గర్వపడలేదు, పడను కూడా. నా జీవితం చివర్లో నా గురించి, నా సినిమాల గురించి ఒక పుస్తకం రాయాలనుకొంటే.. ఒక 100 పేజీలు రాస్తే, అందులో 60 పేజీలు బాహుబలి గురించే ఉంటాయి. ఒక నటుడిగానే కాక ఒక వ్యక్తిగానూ “బాహుబలి” సినిమా నాపై చూపిన ప్రభావమది.prabhas-07-min

ఆ ఆలోచన తప్పు..
ఒక సినిమా హిట్ అయితే హీరో మొదలుకొని డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ఇలా అందరికీ సమానంగా క్రెడిట్ ఇస్తారు. అదే ఒక సినిమా ఫెయిల్ అయితే మాత్రం హీరోని టార్గెట్ చేసేస్తారు. ఆ రోల్ కి హీరో సెట్ అవ్వలేదు అనేస్తారు. అసలు అలా ఎలా జడ్జ్ చేస్తారు అనే విషయం మాత్రం నాకు అర్ధం కాదు. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా రీజన్ స్క్రిప్ట్ మాత్రమే. ఆ విషయాన్ని ఇకనైనా గ్రహిస్తే మంచిది.prabhas-08-min

ఇప్పుడు కాదు కానీ..
“బాహుబలి”తో నేనేదో సూపర్ స్టార్ అయిపోయా అని అందరూ అంటున్నారు కానీ.. నావరకూ నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. సో నేనింకా సూపర్ స్టార్ అవ్వలేదు. భవిష్యత్ లో మాత్రం తప్పకుండా అవుతాను. అదెప్పుడన్నది మాత్రం చెప్పలేను.prabhas-09-min

బాహుబలి తర్వాత అన్నాను కానీ..
ఈ “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అనే ప్రశ్న కంటే నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న “పెళ్లెప్పుడు?”. తమిళ మీడియా కూడా “ఇంతకీ ఎప్పుడు పెళ్లి చేసుకొంటారు?” అని అడిగితే ఏం చెప్పాలో అర్ధం కాక “త్వరలోనే..” అంటూ తప్పించుకొన్నాను. అయితే.. నేను “బాహుబలి” తర్వాత పెళ్లి చేసుకొంటా అని చెప్పానే కానీ.. 2017, 2018లోనే పెళ్లి అని చెప్పలేదు. సో, అతి త్వరలోనే ముందు మీడియాకి చెప్పే పెళ్లి చేసుకొంటాను. కానీ.. ఎప్పుడు అనేది మాత్రం ఇప్పుడు అడక్కండి.prabhas-10-min

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Prabhas
  • #Prabhas Interview
  • #Prabhas New Movie

Also Read

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

Kaliyugam 2064 Review in Telugu: కలియుగం 2064 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

Om Raut: ఆదిపురుష్ అసలు రేటుతో మరో కవర్ డ్రైవ్!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

చిరు, పవన్, ప్రభాస్.. అంతా వీఎఫ్ఎక్స్ బాధితులే..!

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

Prabhas: ప్రభాస్‌ సినిమాలు.. అన్ని పుకార్లకు క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. నిజమవుతుందా?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

రానా – తారక్‌ – చరణ్‌ – నాని.. ఏంటా వాట్సప్‌ గ్రూప్‌ కథ?

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

The Raja Saab: రాజాసాబ్.. రాధేశ్యామ్ ను గుర్తుచేస్తోందిగా!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

Prabhas: ప్రభాస్ ప్రాజెక్టులపై ఫైనల్ గా ఓ క్లారిటీ.. రూమర్స్‌కి చెక్!

trending news

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

HIT 3 Collections: ‘హిట్ 3’ .. మరోసారి కుమ్ముకునే ఛాన్స్ ..!

14 hours ago
Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

Subham Collections: ‘శుభం’ .. పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్!

17 hours ago
#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

#Single Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘సింగిల్’ ఓపెనింగ్స్!

17 hours ago
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ మూవీపై బాలీవుడ్ హడావుడి… పోస్టర్ చూశారా?

22 hours ago
HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

HIT 3 Collections: హిట్ 3′ .. రెండో వీకెండ్ ఆ ఏరియాలు చాలా కీలకం ..!

2 days ago

latest news

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

Nani: మళ్ళీ రెండు బిగ్ టార్గెట్లు సెట్ చేసుకున్న నాని!

14 hours ago
2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

2006 తరువాత ఒక్క హిట్టు లేదు.. సీనియర్ దర్శకుడు ట్రాక్ లోకి వస్తాడా!

14 hours ago
Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

Vijay Deverakonda: దేవరకొండ సినిమా బడ్జెట్ 200 కోట్లా?

15 hours ago
Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

Retro Collections: ‘రెట్రో’ .. ఇంకో 2 రోజులే ఛాన్స్..!

15 hours ago
Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

Vijay Devarakonda: విజయ్‌ ‘కింగ్డమ్‌’ ఇప్పుడు రాదు.. మరెప్పుడు వస్తుందంటే?

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version