Venkatesh: మాజీ స్టార్‌ బౌలర్‌కి తలనొప్పిగా మారిన పేరు.. ఆయన విషెష్‌ ఈయనకు..!

పేరు తెచ్చిన తంటాల గురించి మీరు వినే ఉంటారు. మీరు కూడా ఏదో సందర్భంలో ఇబ్బంది పడే ఉంటారు. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు మాజీ టీమ్‌ ఇండియా పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌. ఆయన పేరులోనే ఓ స్టార్‌ హీరో పేరు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పేరే ఇప్పుడు వెంకటేశ్‌ ప్రసాద్‌కు తీపి ఇబ్బందులు తీసుకొచ్చాయి. దీనంతటికి కారణం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సినిమా. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం అందుకుంది.

Venkatesh

వెంకటేశ్‌ (Venkatesh Daggubati)  – అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో సినిమా గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటీవల టీమ్‌ ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్‌గా వెంకటేష్ ప్రసాద్ ‘ఎక్స్‌’లో #AskVenky పెట్టారు. ఆయన ఇలా క్రికెట్‌ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారులెంది. అయితే.. ఇటీవల ఆయన పెట్టిన సెషన్‌లో ఓ నెటిజన్‌ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి ప్రస్తావించాడు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విజయం సాధించినందుకు కంగ్రాట్స్ సార్ .. ఇలాంటి మంచి సినిమాలు మీరు మరిన్ని చేయాలని కోరుకుంటున్నా అని ఆ నెటిజన్ ట్వీట్ చేశాడు. దీనికి వెంకటేష్ ప్రసాద్ ‘నేను ఆ వెంకీని (Venkatesh) కాదు.. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ గురించి చాలా వింటున్నా అని రిప్లై ఇచ్చారు. దీంతో ఆ ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తనకు సంబంధించిన ట్వీట్‌ కాకపోయినా వెంకటేశ్‌ ప్రసాద్‌ ఇలా రిప్లై ఇవ్వడంతో అభిమానులు మెచ్చుకుంటున్నారు. దిల్‌ రాజు (Dil Raju) నిర్మాణంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో దిల్‌ రాజు ప్రొడక్షన్‌ హౌస్‌ తిరిగి లాభాల బాటలోకి వచ్చింది. ఈ విషయాన్ని ఇటీవల నిర్మాతలు ఓ ప్రెస్‌ మీట్‌లో వివరాలు చెప్పుకొచ్చారు.

ఒరిజినల్‌కి చేసిన మార్పులు ‘భైరవం’కి కలిసొస్తాయా? ముగ్గురికీ కీలకమే మరి!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus