GOAT: ‘విజిల్‌ పోడు’.. ప్చ్‌ ఆ మ్యాజిక్‌ మిస్‌ అయిందబ్బా! కానీ చెన్నైకి హ్యాపీ!

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నినాదం తెలుసు కదా… ‘విజిల్‌ పోడు’. దాని అర్థం విజిల్‌ ఊదు అని. గత 17 ఏళ్లుగా ఈ నినాదంతోనే ఐపీఎల్‌ రాణిస్తున్నారు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఈ మాట ఏకంగా తమిళ యాంథమ్‌ అయిపోయింది కూడా. ఇప్పుడు ఇదే మాటతో ఓ సినిమాలో.. అందులోనూ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) సినిమాలో పాట పెట్టేశారు. ఈ విషయంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ హ్యాపీగా ఉన్నారు కానీ…

విజయ్ ఫ్యాన్స్‌ మాత్రం అంత హ్యాపీగా లేరు అని అంటున్నారు. కారణం పాటలో ఊపు లేకపోవడమే. మాస్‌ పాట.. అందులోనూ హీరో పాడిన పాట అంటే ఓ ఊపు ఉండాలి. అలాంటి బీట్‌లు ఇస్తూ సౌత్‌ సినిమాను అదరగొట్టేస్తున్నారు అనిరుథ్‌ (Anirudh Ravichander) . అయితే ఈ ‘విజిల్‌ పోడు’ పాటను చేసింది యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja). ఆయన పాటలో అంత ఊపు లేదు అనేది విజయ్‌ ఫ్యాన్స్‌ మాట. విజయ్‌ – వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) కాంబినేషన్‌లోని ‘గోట్‌’ (GOAT) సినిమాలోని పాటే ఇది.

పాటలో ఊపు తగ్గిపోడంతో యూట్యూబ్‌లో ఆశించిన స్థాయిలో స్పందన లేదు అని చెబుతున్నారు. అయితే ఈ పాట అంతా విజ‌య్ రాజ‌కీయ ప్రవేశం గురించి చెప్ప‌క‌నే చెబుతూ సాగింది. పార్టీ ఒక‌టి పెడ‌దామా, క్యాంపెయిన్‌ మొద‌లు పెడ‌దామా, మైక్ ప‌ట్టి మాట్లాడ‌దామా అంటూ పాటను కొనసాగించారు. పాట మ‌ధ్య‌లో విజ‌య్ రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లుగానే లిరిక్స్ రాశారు. కానీ అలాంటి పాటను జనాల్లో బాగా పంపాల్సిన మ్యూజిక్‌ విషయంలోనే తేడా కొట్టేసింది అంటున్నారు విజయ్‌ ఫ్యాన్స్‌.

ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి… తర్వాత వచ్చే పాటల్లోనైనా ఊపు ఉండాలి అని కోరుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమా డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు.. సూపర్‌ కింగ్స్‌కు పెద్ద అభిమాని. ఆ లెక్కన తన టీమ్‌కు ఈ ఐపీఎల్‌ టైమ్‌లో యాంథమ్‌ లాంటి ఓ సాంగ్‌ ఇచ్చారు అని కూడా అంటున్నారు నెటిజన్లు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags