Jani Master: జానీ మాస్టర్ సైలెన్స్ గురించి ప్రశిస్తున్న ఫ్యాన్స్.. సైలెన్స్ బ్రేక్ చేయాలంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ (Jani Master)  ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. తెలుగుతో పాటు ఇతర భాషల్లో సైతం జానీ మాస్టర్ కు మంచి పేరు ఉండగా ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేసిన పాటలలో ఎక్కువ పాటలు హిట్ అయ్యాయి. దాదాపుగా 16 సంవత్సరాల నుంచి జానీ మాస్టర్ ఇండస్ట్రీలో ఉండగా రచ్చ సినిమా ద్వారా ఆయనకు ఊహించని స్థాయిలో పాపులారిటీ వచ్చింది. జానీ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పులు ఇతర కొరియోగ్రాఫర్ల స్టెప్పులతో పోల్చి చూస్తే భిన్నంగా ఉండటంతో పాటు ప్రేక్షకుల మెప్పు పొందేవి.

Jani Master

పాటలో లిరిక్స్ కు అనుగుణంగా హీరోల బాడీ లాంగ్వేజ్ ను బట్టి జానీ మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్ కంపోజ్ చేసేవారు. అయితే జానీ మాస్టర్ నంబర్ వన్ కొరియోగ్రాఫర్ అని ఆయన ఎందుకు ఈ విధంగా చేశాడంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది. జానీ మాస్టర్ పరారీలో ఉన్నాడంటూ వార్తలు వస్తుండగా ఆయన మీడియా ముందుకు వచ్చి అసలేం జరిగిందో చెప్పాలని సైలెన్స్ ను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.

జానీ మాస్టర్ తప్పు చేశాడని తాము కూడా నమ్మాల్సి వస్తోందని అతని అభిమానులు చెబుతున్నారు. జానీ మాస్టర్ వరుస వివాదాల వల్ల కెరీర్ ను ప్రమాదంలోకి నెట్టేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జానీ మాస్టర్ ప్రస్తుతం నెల్లూరులో ఉన్నారని పోలీసులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ కు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.

నేషనల్ అవార్డ్ వచ్చిన సంతోషంతో ఉన్న సమయంలో జానీ మాస్టర్ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం షాకిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జానీ మాస్టర్ వివాదంకు సంబంధించి రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఈ కేసు జానీ మాస్టర్ కెరీర్ ను ఇబ్బందుల్లోకి నెట్టే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.

సినిమాల్లోకి రాకముందే మహేష్ తో పరిచయం.. త్రిష కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus