మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తట్టుకోలేవేమో సోనూ ..!

రీల్ లైఫ్ లో విలన్ అయినప్పటికీ.. రియల్ లైఫ్ లో మాత్రం హీరో అనిపించుకుంటున్నాడు సోనూ సూద్. ‘6 అడుగుల 2 అంగుళాల మంచి మనిషి సోనూసూద్’ అంటూ ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. ఈ కరోనా టైములో ఎంతో మంది వలస కూలీలను అతను ఆదుకున్నాడు. వారికి ఆహరం పెట్టడమే కాకుండా.. వారి సొంత ఊర్లకు పంపే ఏర్పాట్లు చేశాడు. ఇటీవల పేద రైతులకు కూడా తన వంతు సాయం చేసాడు. తాజాగా ‘ది కపిల్‌ శర్మ’ షోకు గెస్ట్‌గా వచ్చిన సోనూ సూద్ కు.. ‘అతను సాయం చేసిన కొంతమంది కూలీల వీడియోలను’ అందరి ముందు చూపించారు.

వారు చేసిన ఎమోషనల్ కామెంట్స్ కు సోనూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు సోనూ సూద్ ను విలన్ అంటే…అక్కడ చాలా మంది కొట్టేలా ఉన్నారు. అతను హీరో అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇప్పుడు జనాల్లో సోనూ పై ఉన్న అభిమానాన్ని చూసి అక్కడి స్టార్ హీరోలు సైతం ఇన్సెక్యూర్ గా ఫీలవుతున్నారని వినికిడి. దాంతో సోనూ సూద్ చెయ్యాల్సిన సినిమాల నుండీ అతన్ని తప్పించినా ఆశ్చర్యం లేదని కొందరు బాలీవుడ్ మీడియా సభ్యులు చెప్పుకొస్తున్నారు. ‘జనాలు చాలా షార్ట్ మైండెడ్.. చేసిన మంచినైనా.. చెడునైనా’ ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోరు.

కానీ బాలీవుడ్ స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల ఇగోని రెచ్చగొడితే మాత్రం కచ్చితంగా ఎప్పటికీ మర్చిపోకుండా..పగ సాధించే వాళ్ళే. అలా అని వాళ్ళు కోరుకుంటున్నట్టు సోనూసూద్ హీరోగా చేస్తే మాత్రం జనాలు చూస్తారా.. ఒక వేళ చూసినా.. ఆఫర్లు వస్తాయా అన్నది పెద్ద ప్రశ్న. కాబట్టి జనాల ఎక్స్పెక్టేషన్స్ సోనూ కొంప ముంచకపోతే అంతే చాలు’ అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Most Recommended Video

పవర్ స్టార్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఎస్.ఎస్.రాజమౌళి సినిమాల IMDB రేటింగ్స్!
తెలుగు సినిమాల్లో నటించిన 27 బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus