Anasuya: అనసూయను కారును అడ్డకున్న అభిమానులు… అసలు ఏమి జరిగిందంటే?

యాంకర్ అనసూయ జబర్దస్త్ మానేసిన కూడా ఆమెకు జనాల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.. అమె పబ్లిక్ లో కనిపిస్తే చాలు కుర్రాళ్లు ఎగబడుతున్నారు.. ప్రస్తుతం ఆమె కేరీర్ పీక్స్ లో ఉందని వేరేలా చెప్పనక్కర్లేదు.. వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు కూడా అనసూయ ఎక్కువగా వెళ్తుంది.. ఇలా కూడా బాగానే సంపాదిస్తుంది.. తాజాగా అనసూయ తెలంగాణ కోదాడ వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ షాప్ ఓపెనింగ్ లో ఆమె పాల్గొన్నారు.

అనసూయ రాకను తెలుసుకున్న యువత పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు.. అనసూయ కారును చుట్టుముట్టారు. సెక్యూరిటీ మధ్య ఆమెను వేదికపైకి తీసుకెళ్లారు.. అక్కడ ఆమె కార్యక్రమం అనంతరం మాట్లాడుతుంటే అస్సలు మాట్లాడనివ్వకుండా ఈలలు వేస్తూ గోల చేశారు.. ఆ ప్రాంతం అంత వారి కేకలతో రచ్చ రచ్చగా మారింది… అనసూయ కోదాడ లో చేసిన సందడికి సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

ఇక అనసూయ (Anasuya) సినిమాల విషయానికొస్తే..విమానం లో అనసూయ వేశ్య పాత్ర చేశారు. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేస్తూ జీవనం సాగించే ఒంటరి స్త్రీగా ఆమె పాత్ర ఉంది.. ఇవే కాదు పుష్ప 2 లో దాక్షాయణిగా నటిస్తుంది. ఇది నెగిటివ్ రోల్. డీ గ్లామర్ లుక్ లో అనసూయ షాక్ ఇచ్చారు. పార్ట్ 2లో సునీల్, అనసూయ పాత్రలను దర్శకుడు సుకుమార్ ఎలా ముగించారో చూడాలి.

డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా పుష్ప 2 విడుదల కానుందనే ప్రచారం జరుగుతుంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో పుష్ప 2 తెరకెక్కిస్తున్నారు.. ఇక సోషల్ మీడియాలో కూడా అనసూయ యాక్టివ్ గా ఉంటుంది. అందంతోపాటు వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా సోషల్ మీడియాలో అప్పుటప్పుడు ట్రెండ్ అవుతోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus