Ram Charan, Jr NTR: స్టార్ హీరోలు భరోసా ఇస్తున్నా ఫ్యాన్స్ కు టెన్షన్ తగ్గడం లేదుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తుండటం అభిమానులను ఒకింత టెన్షన్ పెడుతోంది. టాలీవుడ్ డైరెక్టర్లు డీల్ చేసిన విధంగా బాలీవుడ్ డైరెక్టర్లు చరణ్, తారక్ లను డీల్ చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చరణ్, తారక్ లకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

జూనియర్ ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వార్2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ మధ్య కాలంలో ఈ తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలు అభిమానులను ఆకట్టుకునే విషయంలో ఫెయిలవుతున్నాయి. అందువల్ల వార్2 విషయంలో తారక్ అభిమానులకు టెన్షన్ తగ్గడం లేదు. ఈ సినిమాలో తారక్ రోల్ నిడివి విషయంలో సైతం అభిమానులకు టెన్షన్ కలుగుతుండటం గమనార్హం.

రామ్ చరణ్ సైతం సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. అయితే ఈసారి మాత్రం ఈ కాంబోలో సినిమా కచ్చితంగా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. అయితే చరణ్, తారక్ బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడం సరైన నిర్ణయమేనా అని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ మూవీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడం (Ram Charan) చరణ్, తారక్ అభిమానుల టెన్షన్ కు కారణం కావడం గమనార్హం. టాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలలో ఎంతోమంది టాలెంటెడ్ డైరెక్టర్లు ఉండగా వాళ్లకు ఛాన్స్ ఇస్తే బాగుంటుందని ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్, తారక్ హిందీ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించబోయే సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus