వకీల్ సాబ్ టీజర్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసి ఫ్యాన్స్ చాలాకాలం అయ్యింది. అప్పుడెప్పుడో సంక్రాంతికి రిలీజైన అజ్యాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ని సిల్వర్ స్క్రీన్ పైన చూడలేదు. అందుకే, వకీల్ సాబ్ సినిమాని ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ టైమ్ లో సంక్రాంతి రోజున రిలీజ్ కాబోయే టీజర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీజర్ రాకముందే యాష్ ట్యాగ్స్ ని ట్రెండింగ్ చేసేస్తున్నారు ఫ్యాన్స్ అందరూ.

కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు, పవన్ కళ్యాణ్ పైన ఏ న్యూస్ వచ్చినా కూడా ఇదే ట్యాగ్ ని వైరల్ చేస్తున్నారు. వకీల్ సాబ్ టీజర్ ( #vakheelsaabteaser ) అంటూ ఒక ట్యాగ్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. డైరెక్టర్ వేణుశ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో శృతిహాసన్ యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నామన్న ఆనందం, అలాగే టీజర్ సంక్రాంతి పండక్కి వస్తోందన్న సంబరం అన్నీ కలిపి ఫ్యాన్స్ ని తెగ ఊరించేస్తోంది.

ఇక టీజర్ రిలీజ్ అవ్వగానే భారీ రికార్డ్ ని కొట్టాలని కూడా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ టీజర్ 1నిమిషం పైనే ఉంటుందని టాక్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తినెలకొంది. ఇక థమన్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నివేధా థామస్ , అంజలి, శృతిహాసన్ ల వ్యూజువల్స్, పవన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ తో టీజర్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా ఉంటుందని టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా టీజర్ లో చూపిస్తారని కూడా అంటున్నారు. అదీ మేటర్.

Most Recommended Video

క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
అల్లు అర్జున్ నుండి నాగ చైతన్య వరకు.. అందమైన స్టార్ కాపుల్స్.. సతీమణులే స్పెషల్ ఎట్రాక్షన్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus