Liger Movie: పూరి జగన్నాథ్‌ మరీ ఇంత కామెడీగా ఎలా ఆలోచించారో?

  • August 26, 2022 / 11:53 AM IST

మైక్‌ టైసన్‌.. ఆ పేరు వింటే ఓ నిలువెత్తు విగ్రహం కళ్ల ముందు కదలాడుతుంది. ఆ భారీకాయం చూస్తే.. కచ్చితంగా వెన్నులో చలి పుడుతుంది. ఆయన రింగ్‌లోకి దిగి చేసిన ఫైట్స్‌ చూసినవాళ్లకు ఇంకాస్త ఎక్కువ భయమే కలుగుతుంది. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి.. భారతీయ సినిమాలో నటింపజేశారు అంటే.. ఎంత హైప్‌ వస్తుంది. ఆ తర్వాత ఆయన్ని సినిమాలో చూస్తే ప్రేక్షకులకు ఎంత సరదా వస్తుంది. మామూలుగా ఉండదు కదా. అయితే సగం పని బాగానే చేసి పూరి జగన్నాథ్‌ అంట్‌ టీమ్‌.. ప్రేక్షకుల్ని అలరించడంలో మాత్రం నిరాశపరిచారు.

మేమైతే ఇలా సాఫ్ట్‌గా చెబుతున్నాం కానీ.. మైక్‌ టైసన్‌ అభిమాని ఎవరైనా ‘లైగర్‌’ సినిమా చూస్తే.. ఇంకాస్త గట్టిగానే అంటారు. కారణం ఆ సినిమాలో టైసన్‌ను చూపించిన విధానం. ప్రపంచ మేటి బాక్సింగ్‌ ఛాంపియన్‌ను జోకర్‌కి ఎక్కువ, కమెడియన్‌కి తక్కువ అనేలా చూపించారు అంటే.. టీమ్‌ని ఏమనాలి? అవును, ‘లైగర్‌’లో టైసన్‌ అలానే కనిపించాడు. సారీ చూపించారు. మేటి బాక్సర్‌ని ఓ మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో ఉన్న సినిమాలోకి తీసుకొని చిన్నపిల్లల ఫైట్‌ లాంటిది పెడితే ఏం అనాలి?

‘వాట్‌ లగా దేంగే’ అంటూ విజయ్‌ దేవరకొండ, ఛార్మి ప్రచారంలో చెబుతుంటే.. టైసన్‌తో విజయ్‌కి భారీ ఫైట్‌ లాంటిది ఏమైనా పెట్టారా? లేక విజయ్‌కి, టైసన్‌కి రిలేషన్‌లో ఏదైనా ట్విస్ట్ పెట్టారా అని అనుకుంటే.. హీరోయిన్‌ కిడ్నాప్‌ సీన్ పెట్టి, విజయ్‌ రక్షించేలా చేశారు. దానికి మైక్‌ టైసనే కావాలా ఏంటి? మన దగ్గర అంత బాడీ ఉన్న వాళ్లు, విలనీ లుక్‌ ఉన్న వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లను పెట్టుకున్నా సరిపోతుంది.

లెజెండ్‌ బాక్సర్‌ను తీసుకొచ్చి కామెడీ చేయించింది.. ఆయన కోసం మేం చాలా కష్టపడ్డాం అనే కతలు పడటం ఎందుకో అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ నుండి ఇలాంటి మిస్టేక్‌, రాంగ్‌ స్టెప్‌ను ఎవరూ ఊహించి ఉండరు. దీంతో టైసన్‌ను తెలుగు తెరపై చూసి మురిసిపోదాం అనుకున్నవాళ్లంతా చేసేదేం లేక ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బయటకు వస్తున్నారు. సారీ టైసన్‌.. నీకు తగ్గ పాత్ర ఇవ్వలేకపోయాం. మళ్లీ మా సినిమాల్లో నటించే అవకాశం నువ్వు ఇస్తే మంచి పాత్ర రాయమని మా దర్శకరచయితలకు కోరుకోవడం ఒక్కటే మా చేతుల్లో ఉంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus