కొన్ని కథలు, కాన్సెప్ట్‌లు విన్నప్పుడు చాలా బాగుంటాయి. కానీ ఎందుకు ఆ సినిమా ఓకే అవ్వలేదు, పట్టాలెక్కలేదు అని అనిపిస్తుంటుంది. అలా మంచి హిట్ కథను మిస్ అయ్యామే అనిపిస్తుంది కూడా. అలాంటి వాటిలో టాలీవుడ్ ఓ సినిమా చాలా రోజుల క్రితం మిస్ అయ్యింది. అది కూడా మెగా ఫ్యామిలీ నుండి. ఇప్పుడు అదే కుటుంబం నుండి సేమ్ కాన్సెప్ట్‌లో సినిమా రాబోతోంది. చేస్తోంది మెగాస్టార్ చిరంజీవి అయితే చేయబోతోంది తండ్రీ – కొడుకులు కాన్సెప్ట్.
ఈ మేరకు (mega compound) మెగా కాంపౌండ్‌లో ఆసక్తికరమైన చర్చ ఒకటి జరుగుతోంది. మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే వ్యక్తుల నుండి వచ్చిన సమాచారం ప్రకారం చాలా కాలం క్రితం వెలిగొండ శ్రీనివాస్ అనే రచయిత ఓ కథ రాసుకున్నారు. ఓ నాన్న తన కొడుక్కి పెళ్లి చేయాలనుకొంటే, కొడుకేమో తండ్రికే పెళ్లి చేయాలని చూస్తుంటాడు.. శ్రీకాంత్ – కృష్ణంరాజు కాంబినేషన్‌లో వచ్చిన ‘మా నాన్నకి పెళ్లి’ సినిమా లాంటి కథే. అప్పట్లో నాగబాబు, తరుణ్ కాంబోలో ఈ సినిమాల అనుకున్నారు.
కథ ఓకే అయ్యి త్వరలో పట్టాలెక్కుతుంది అనుకుంటుండగా ఆగిపోయింది. అయితే ఇన్నాళ్లకు ఇలాంటి కథ ఒకటి మెగా ఫ్యామిలీ నుండి రాబోతోంది. ప్రసన్నకుమార్ బెజవాడ రాసిన తండ్రీ – కొడుకుల కథ… చిరంజీవికి బాగా నచ్చిందట. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. మలయాళంలో వచ్చిన ‘బ్రో డాడీ’ సినిమా ఫ్లేవర్‌లోనే ఇది కూడా ఉంటుందట. ఇందులో చిరంజీవి తనయుడిగా సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్నాడు.
చిరంజీవి త్రిష నటిస్తుందని సమాచారం. ఇక సిద్ధు పక్కన శ్రీలీలను అనుకుంటున్నారట. చిరు తనయ సుస్మిత ఈ సినిమాను నిర్మిస్తారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆగస్టులో ఈ సినిమా మొదలవుతుందట. ఈ నేపథ్యంలో గతంలో మెగా ఫ్యామిలీ నుండి వస్తుంనుకున్న కాన్సెప్ట్ ఇప్పుడు చిరంజీవి నుండి వస్తుందన్నమాట. మరి ఇప్పుడేం అవుతుందో చూడాలి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!