2025 ఫిబ్రవరి ప్రోగ్రెస్ రిపోర్ట్.. అవి తప్ప అన్నీ…?!

2025 లోకి మనం ఎంటర్ అవ్వడం.. అప్పుడే రెండు నెలలు పూర్తయిపోయింది. నేటితో ఫిబ్రవరి నెల కూడా పూర్తయిపోతుంది. మరి ఈ నెల బాక్సాఫీస్ రిపోర్ట్ ఎలా ఉంది అంటే.. కచ్చితంగా ఆశించిన స్థాయిలో లేదు అనే చెప్పాలి. ఈ నెలలో డబ్బింగ్, చిన్న చితకా సినిమాలతో (Movies ) కలుపుకుని మొత్తంగా 40 కి పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘భవాని వర్డ్ 1997’ ‘ఒక పధకం ప్రకారం’ ‘తండేల్’ (Thandel)  ‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) ‘లైలా'(Laila)   ‘నిదురించు జహాపనా’ ‘తల’ ‘బాపు’ (Baapu) ‘రామం రాఘవం’ (Ramam Raghavam) ‘మజాకా’ ‘తకిట తదిమి తందాన’ ‘బండి’ ‘గార్డ్’ ‘నేనెక్కడున్నా’ వంటి సినిమాలు రిలీజ్ అయ్యాయి.

Movies

అలాగే ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’  (Jaabilamma Neeku Antha Kopama) ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return of the Dragon)  ‘శబ్దం’ (Sabdham)  వంటి డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ‘తండేల్’ సినిమా బాగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద అది రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసినట్లు మేకర్స్ పోస్టర్ వదిలారు. ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో ఆ సినిమా డీసెంట్ వసూళ్లు రాబడుతుంది. మరోపక్క తమిళ డబ్బింగ్ సినిమాలు అయినటువంటి ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కూడా క్లీన్ హిట్ గా నిలిచింది.

‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ కి హిట్ టాక్ వచ్చినా వసూళ్లు ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక సందీప్ కిషన్  (Sundeep Kishan)  ‘మజాకా’ (Mazaka) సినిమా బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతోంది. సినిమాకి మిక్స్డ్ టాక్ రావడంతో.. ఓపెనింగ్స్ ఆశాజనకంగా లేవు. మొత్తంగా ఈ ఫిబ్రవరి నెల ‘తండేల్’ రూపంలో ఒక రూ.100 కోట్ల సినిమా.. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ అనే డబ్బింగ్ సినిమా రూపంలో వచ్చి క్లీన్ హిట్ గా నిలిచాయి. సో అన్ సీజన్ గా పిలవబడే ఫిబ్రవరి డల్ గానే ముగిసింది అనుకోవాలి.

 ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ పై నాగవంశీ కామెంట్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus