Tollywood: సంక్రాంతి ఎక్స్‌టెండెడ్‌.. మామూలుగా ఉండదు!

టాలీవుడ్‌లో సీజన్‌ అంటే సంక్రాంతి, వేసవి, దసరా అని చెబుతారు. గత కొన్నేళ్లుగా ఇవే సీజన్లు కొనసాగుతున్నాయి. మిగిలిన సమయాల్లో సినిమాలు వచ్చినా… పై మూడు సీజన్లలో వచ్చే సినిమాలు ఓ లెవల్‌లో ఉంటాయి. అయితే వీటికి ఎక్స్‌టెండెడ్‌గా కొన్ని నెలలు ఇప్పుడు వచ్చాయి. అలాంటి వాటిలో డిసెంబరు ఒకటి. ఇయర్‌ ఎండింగ్‌లో సినిమాలు విడుదల చేయడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. అయితే కరోనా పుణ్యమా అని టాలీవుడ్‌లో సీజన్లన్నీ కలిసి, కలగాపులంగా అయిపోయాయి. ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడే సీజన్‌ అంటున్నారు. అలా వచ్చే ఏడాది ఫిబ్రవరి కూడా బిజీ సీజన్‌గా మారిపోయింది.

సినిమా వాళ్ల లెక్క ప్రకారం ఫిబ్రవరి పెద్ద బోరింగ్‌. అన్‌ సీజన్‌ అని సింపుల్‌గా చెప్పేస్తుంటారు. సంక్రాంతి తర్వాత అందరూ పరీక్షల బిజీలో పడిపోతారు కాబట్టి… వసూళ్లు ఉండవనేది సినిమా పెద్దల ఆలోచన. అందుకే సినిమాలు పెద్దగా రావు. కానీ 2022లో పెద్ద ఎత్తున సినిమాలు రాబోతున్నాయి. పొట్టి నెలలో నాలుగో తేదీ నుండే ఫిబ్ర‘వార్‌’ మొదలవబోతోంది. అది నెలాఖరు వరకు ఉండబోతోంది. ఫిబ్రవరి మొదలయ్యేది మెగాస్టార్‌తోనే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

నాలుగో తేదీన మెగా ‘ఆచార్య’ రాబోతోంది. సంక్రాంతి సందడి కాస్త సద్దుమణగగానే చిరంజీవి – రామ్‌చరణ్‌ థియేటర్లకు రాబోతున్నారు. ఆ తర్వాత రెండో వారంలో రవితేజ ‘ఖిలాడీ’గా మారి అడివి శేష్‌ ‘మేజర్‌’తో పోటీ పడబోతున్నాడు. ఈ రెండూ 11న విడుదలవుతాయి. మూడో వారం వచ్చేసరికి కుర్ర హీరో నిఖిల్‌ రాబోతున్నాడు. తన ‘18 పేజెస్‌’ 18న బయటకు తీసుకొస్తున్నారు. ఆ తర్వాతి వారం ‘ఎఫ్‌ 3’ వంతు. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ వినోదాలు ఆ వారమే థియేటర్లలో లాండ్‌ అవుతాయి.

ఇవి కాకుండా శర్వానంద్‌ ‘ఒకే ఒక జీవితం’ ఫిబ్రవరిలోనే వస్తుందంటున్నారు. నాగచైతన్య – విక్రమ్‌ కె కుమార్‌ ‘థ్యాంక్‌ యూ’, రానా – సాయిపల్లవి ‘విరాటపర్వం’, నాగార్జున – నాగచైతన్య ‘బంగార్రాజు’ కూడా ఫిబ్రవరిలోనే వస్తాయని టాక్‌. అయితే ఆ సినిమా విడుదల తేదీల మీద క్లారిటీ రావడం లేదు. ఏదైతేముంది అన్‌సీజన్‌లో నాన్‌ స్టాప్‌ సినిమాలు రాబోతున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus