Raaka: అల్లు అర్జున్ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?
- June 3, 2026 / 04:22 PM ISTByFilmy Focus Desk
అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్‌లో నలుగురైదుగురు హీరోయిన్లతో రూపొందుతున్న చిత్రం ‘రాకా’. ఆ నలుగురైదుగురు హీరోయిన్లలో దీపికా పడుకొణె పేరే ఇప్పటివరకు అధికారికంగా అనౌన్స్ చేశారు. మిగిలిన హీరోయిన్ల పేర్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఆ హీరోయిన్లలో ఉందో లేదో తెలియదు కానీ.. ఓ మలయాళ హీరోయిన్ పేరు చర్చలోకి వచ్చింది. ఆమెనే మలయాళ నటి ఫెమినా జార్జ్. ఫెమినా జార్జ్ ఇటీవల ఓ సినిమా ప్రచారంలో మాట్లాడుతూ ‘రాకా’ సినిమాలో నటించినట్లు చెప్పుకొచ్చింది.
Raaka
నా ‘డిస్కో’ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ‘రాకా’ సినిమా టీమ్ నుండి ఫోన్ వచ్చింది. ‘రాకా’ లాంటి పెద్ద సినిమాలో నటిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. నా కెరీర్‌లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అత్యంత భారీ సినిమా. అల్లు అర్జున్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ‘హ్యాపీ’ సినిమానే నేను చూసిన మొదటి అల్లు అర్జున్ చిత్రం. అప్పటి నుండి బన్నీకి పెద్ద ఫ్యాన్. ఇక ‘రాకా’ విషయానికొస్తే.. ఈ సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే అయినా ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆనందంగా ఉంది.

ఇక ఫెమినా విషయానికొస్తే.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 2021లో నెట్‌ఫ్లిక్స్ సూపర్ హీరో చిత్రం ‘మిన్నల్ మురళి’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత రెండేళ్లకు ‘తీప్పొరి బెన్నీ’, ‘శేషం మైక్ ఇన్ ఫాతిమా’ అనే సినిమాల్లో నటంచింది. ఆమె నటించిన ‘కరక్కం’ అనే సినిమా గత నెలాఖరులో విడుదలైంది.
ఇక ‘రాకా’ సినిమా సంగతి చూస్తే.. దీపికా పడుకొణెతోపాటు జాన్వీ కపూర్, రష్మిక మందన, మృణాల్ ఠాకూర్ లాంటి పేర్లు వార్తల్లో ఉన్నాయి. దీనిపై టీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆ హీరోయిన్ల పుట్టిన రోజు సందర్భాల్లో వారి లుక్స్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది














