వరుణ్ తేజ్ హీరోగా ‘ముకుంద’ ‘కంచె’ ‘లోఫర్’ ‘మిస్టర్’ వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ.. సక్సెస్ అందుకోలేకపోయాడు వరుణ్ తేజ్. అలాంటి టైంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ఫిదా’ చేశాడు వరుణ్ తేజ్. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్. దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఆ టైంలో ఫామ్లో ఏమీ లేడు. దిల్ రాజు కూడా ‘డిజె'(దువ్వాడ జగన్నాథం) తో నష్టాల్లో ఉన్నారు. అందువల్ల ‘ఫిదా’ పై మొదట అంచనాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో 2017 జూలై 21న విడుదలైన ‘ఫిదా’ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
తర్వాత రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతూనే వచ్చాయి. ఫైనల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అనిపించింది. నేటితో 8 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ‘ఫిదా’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 17.97 cr |
సీడెడ్ | 4.31 cr |
ఉత్తరాంధ్ర | 4.60 cr |
ఈస్ట్ | 2.40 cr |
వెస్ట్ | 1.81 cr |
గుంటూరు | 2.55 cr |
కృష్ణా | 2.25 cr |
నెల్లూరు | 1.07 cr |
ఏపీ+తెలంగాణ | 36.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 10.78 cr |
వరల్డ్ టోటల్ | 47.74 cr |
‘ఫిదా’ చిత్రం రూ.19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే ఫుల్ రన్లో ఎవ్వరూ ఊహించని విధంగా రూ.47.74 కోట్ల షేర్ ను రాబట్టి.. డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.90 కోట్ల వరకు కొల్లగొట్టింది. ఫైనల్ గా బయ్యర్లకు ఏకంగా రూ.28.74 కోట్ల లాభాలు అందించింది.