మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫిదా’. దిల్ రాజు తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించాడు. అప్పటి వరకు వరుణ్ తేజ్ కు ఒక్క హిట్టు కూడా లేదు. అలాగే దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా ఫామ్లో లేడు. ఇక ఆ టైములో దిల్ రాజు నిర్మించిన ‘డిజె'(దువ్వాడ జగన్నాథం) కూడా సొ సొగానే ఆడింది. కాబట్టి ‘ఫిదా’ పై ఎటువంటి అంచనాలు లేవు. అయితే జూలై 21(2017 వ సంవత్సరం) న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈవెనింగ్ షోల నుండీ ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న థియేటర్లలో హౌస్ఫుల్ బోర్డులు పడ్డాయి. అలా వరుణ్ కి మొదటి బ్లాక్ బస్టర్ అందించిన చిత్రంగా ‘ఫిదా’ రికార్డు సృష్టించింది. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 4 ఏళ్ళు పూర్తికావస్తోంది.
మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 17.97 cr |
సీడెడ్ | 4.31 cr |
ఉత్తరాంధ్ర | 4.60 cr |
ఈస్ట్ | 2.40 cr |
వెస్ట్ | 1.81 cr |
గుంటూరు | 2.55 cr |
కృష్ణా | 2.25 cr |
నెల్లూరు | 1.07 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 36.96 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 3.48 cr |
ఓవర్సీస్ | 7.30 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 47.74 cr |
‘ఫిదా’ చిత్రానికి కేవలం రూ.19 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.47.74 కోట్ల షేర్ ను రాబట్టి.. బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకు ఏకంగా రూ.28.74 కోట్ల లాభాలు దక్కడం విశేషం.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్